Begin typing your search above and press return to search.

స‌భ అయిపోయాక‌.. చెత్త ఏరేస్తాం..!

ఈ వ్య‌వ‌హారంపై జ‌న‌సేన నాయ‌కు డు, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ తాజాగా స్పందించారు. స‌భ‌కు 2-4 ల‌క్ష‌ల మంది వ‌స్తార‌న్న అంచ‌నా ఉంద‌న్నారు.

By:  Tupaki Desk   |   11 March 2025 5:00 AM IST
స‌భ అయిపోయాక‌.. చెత్త ఏరేస్తాం..!
X

జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌ను ఈ నెల 12న పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే దాదాపు స‌భా ప్రాంగ‌ణానికి ఒక రూపం తీసుకువ‌చ్చా రు. మిగిలిన‌ప‌నులు కూడా అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై జ‌న‌సేన నాయ‌కు డు, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ తాజాగా స్పందించారు. స‌భ‌కు 2-4 ల‌క్ష‌ల మంది వ‌స్తార‌న్న అంచ‌నా ఉంద‌న్నారు. అయితే.. ఏర్పాట్లు మాత్రం 5 ల‌క్ష‌ల మందికి చేస్తున్నామ‌న్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం తీసుకుంటున్నా.. దానికి సంబంధించిన సొమ్ములు చెల్లిస్తామ‌ని చెప్పారు. అదేవిధంగా ప్రాంగ‌ణం కోసం తీసుకున్న భూమికి కూడా అద్దె చెల్లించాల‌ని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన‌ట్టు తెలిపారు. పార్కింగ్‌, ఇత‌ర సౌక‌ర్యాల ఏర్పాటు కోసం.. ఇప్ప‌టికే క‌మిటీలు ఏర్పాటు చేశామ‌ని.. వాటి నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి తేడాలు రాకుండా చూసుకునేందుకు కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌న్నారు.

అదేస‌మ‌యంలో స‌భ ముగిసిన త‌ర్వాత‌.. ఏర్ప‌డే చెత్త‌ను తామే స్వ‌యంగా ఏరి వేయాల‌ని నిర్ణ‌యించుకు న్న‌ట్టు మంత్రి నాదెండ్ల చెప్పారు. సాధార‌ణంగా.. ఇలాంటి స‌భ‌లు జ‌రిగిన త‌ర్వాత నిర్వాహ‌కులు మౌనంగా వెళ్లిపోతార‌ని.. కానీ, త‌మ నాయ‌కుడు అలా కాకుండా.. చెత్త వేరి.. స‌భ ప్రారంభానికి ముందు ఆ స్థ‌లం ఎలా ఉందో అలానే అప్ప‌గించాల‌ని ఆదేశించిన‌ట్టు పేర్కొన్నారు. అదేవిధంగా స‌భ‌కు వ‌చ్చే వారికి క్ర‌మ‌శిక్ష‌ణ ప్ర‌కారం.. సీట్లు కేటాయించ‌నున్న‌ట్టు చెప్పారు.

ఇక‌, పిఠాపురంలో టీడీపీ నాయ‌కుడు వ‌ర్మ‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వ‌కుండా.. ప‌వ‌న్ అడ్డుకున్నార‌న్న వార్త‌ల‌పై ఆయ‌న తీవ్రంగా స్పందించారు. పిఠాపురం ప‌వ‌న్ క‌ల్యాణ్ అడ్డా అని.. ఆయ‌న శాస్వ‌త నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. వ‌ర్మ టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడ‌ని, ఆయ‌న స‌మ‌స్య ఏదైనా ఉంటే టీడీపీలో చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకుంటార‌ని అన్నారు. దీనికి , జ‌న‌సేన‌కు సంబంధం లేద‌న్నారు. ఈ విష‌యంలో అన‌వ‌స‌రంగా పవ‌న్ క‌ల్యాణ్ పేరును లాగొద్ద‌ని ఆయ‌న విన్న‌వించారు.