టీడీపీ జనసేన పొత్తులో జనసేన సీట్లు ఇవే...!
ఏపీలో టీడీపీ జనసేన పొత్తు కుదిరింది. మరి జనసేనకు ఎన్ని సీట్లు టీడీపీ ఇస్తుంది అన్నది చర్చనీయాంశంగా ఉంది. జనసేన అయితే ఒక బిగ్ నంబర్ నే పెట్టుకుంది అని ప్రచారం సాగుతోంది
By: Tupaki Desk | 26 Oct 2023 8:00 AM GMTఏపీలో టీడీపీ జనసేన పొత్తు కుదిరింది. మరి జనసేనకు ఎన్ని సీట్లు టీడీపీ ఇస్తుంది అన్నది చర్చనీయాంశంగా ఉంది. జనసేన అయితే ఒక బిగ్ నంబర్ నే పెట్టుకుంది అని ప్రచారం సాగుతోంది. గౌరవప్రదమైన సీట్లు అన్న మాటను జనసేనాని పవన్ పదే పదే వాడుతూ వస్తున్నారు. మరి అలా చూసుకుంటే ఎన్ని సీట్లు అంటే ఎవరికి తోచిన నంబర్ వారు చెప్పుకొస్తున్నారు.
అయితే ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే జనసేనకు 30 దాకా సీట్లు టీడీపీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జిల్లాల వారీగా కూడా జనసేనకు ఇవే సీట్లు దక్కవచ్చు అని కూడా చెబుతున్నారు. ముందుగా ఉత్తరాంధ్రా నుంచి మొదలెడితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో జనసేనకు సీట్లు ఇవ్వరని అంటున్నారు.
విశాఖ:
ఇక విశాఖ జిల్లాలో రెండంటే రెండు సీట్లు ఇస్తారని తెలుస్తోంది. ఆ రెండూ చూస్తే గాజువాక, ఎలమంచిలి అని అంటున్నారు.
తూర్పు గోదావరి జిల్లా:
తూర్పు గోదావరి జిల్లాలో ఎనిమిది దాకా సీట్లు జనసేనకు దక్కుతాయని అంటున్నారు. అవి చూస్తే కనుక పిఠాపురం, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్త పేట, రాజమండ్రి రూరల్ గా ఉనాయని చెబుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా:
ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే జనసేనకు అయిదు సీట్లు దక్కుతాయని అంటున్నారు. ఆ సీట్లు చూసుకుంటే కనుక తణుకు, భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలుగా పేర్కొంటున్నారు.
గుంటూరు జిల్లా:
ఇక గుంటూరు జిల్లాలో చూస్తే జనసేనకు రెండు సీట్లు దక్కుతాయని తెలుస్తోంది. ఆ సీట్లలో ఒకటి తెనాలిగా ఉంది. రెండవది పత్తిపాడు అని అంటున్నారు.
ప్రకాశం జిల్లా :
అలాగే ప్రకాశం జిల్లాలో సైతం రెండు సీట్లు ఇస్తారని అంటున్నారు. అందులో ఒకటి దర్శి, రెండవది గిద్దలూరుగా చెబుతున్నారు.
నెల్లూరు జిల్లా:
అదే విధంగా నెల్లూరు జిల్లాలో అయితే ఒక్క సీటు కూడా జనసేనకు దక్కదని అంటున్నారు.
చిత్తూరు జిల్లా:
చిత్తూరు జిల్లాలో చూస్తే రెండు సీట్లు ఇవ్వబోతున్నారని అంటున్నారు. అందులో తిరుపతి ఒకటైతే చిత్తూరు రెండవది అని చెబుతున్నారు.
కడప జిల్లా:
అలాగే కడప జిల్లాలో జనసేనకు రెండు సీట్లు పొత్తులో దక్కబోతున్నాయి. అందులో ఒకటి పులివెందుల అయితే రెండవది మైదుకూరు అని అంటున్నారు.
కర్నూల్ జిల్లా:
అదే జాబితాలో చూస్తే కర్నూల్ ఒక సీటు జనసేనకు ఇస్తారని తెలుస్తోంది. ఆ ఒక్క సీటూ కర్నూల్ అని అంటున్నారు.
అనంతపురం జిల్లా:
అనంతపురం జిల్లాలో జనసేనకు అనంతపురం సీటు ఒకటి దక్కనుందిట. అలాగ కనుక చూస్తే మొత్తం 28 సీట్ల దాకా అయ్యాయని చెబుతున్నారు. వీటికి మరో రెండు కలిపి టోటల్ ముప్పయి గా ఫిక్స్ చేసి రౌండ్ ఫిగర్ ని చూపిస్తారు అన్ అంటున్నారు.
వీటితో పాటు ఎంపీ సీట్లు జనసేనకు మూడు దాకా ఇవ్వవచ్చు అని టాక్ నడుస్తోంది. అవి ఒకటి మచిలీపట్నం అయితే రెండవది నర్సాపురంగా ఉంది అంటున్నారు. ఇక కాకినాడ లేక విశాఖపట్నం మూడవ సీటుగా ఉండబోతోంది అని అంటున్నారు.
ఇలా జనసేన పొత్తు విషయంలో కచ్చితమైన లెక్కలోనే టీడీపీ ఉంది అని అంటున్నారు. ఆ మధ్యన చంద్రబాబుతో లోకేష్ పవన్ కళ్యాణ్ కలసినపుడే ఈ సీట్ల మీద కన్ఫర్మేషన్ వచ్చింది అని అంటున్నారు. దాంతో జనసేనకు ఇచ్చే సీట్లు ఇవే అంటూ ఇపుడు పెద్ద ఎత్తున టాక్ అయితే నడుస్తోంది. ఈ సీటు కనుక జనసేనకు ఇస్తే టీడీపీ నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత రాదని అంటున్నారు. తమ్ముళ్ళు కూడా వీటి విషయంలో పెద్దగా బాధపడాల్సింది లేదు అని అంటున్నారు.
మొత్తం 175లో ముప్పయి సీట్లు జనసేనకు ఇవ్వడం ద్వారా గెలుపు గ్యారంటీ చేసుకోవచ్చు అని పక్కా ప్లాన్ తో టీడీపీ ఉంది అని అంటున్నారు. అయితే జనసేనలో ఉన్న వారికి 30 సీట్లు అంటే ఓకేనా అన్నదే చూడాలని అంటున్నారు. ముప్పయి సీట్లు ఇస్తే ఇందులో గెలిచే సీట్లు ఎన్ని ఉంటాయి, అలాగే పవన్ సీఎం అన్న నినాదం కానీ అధికారంలో వాటా కానీ ఏమవుతుంది అన్నది కూడా జనసైనికులకు ఆవేదనగా ఉంటే మాత్రం ఈ సీట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.
అయితే ముప్పయి దాకా సీట్లు జనసేనకు ఇవ్వడం అన్నది కూడా ఆషామాషీ కాదు అని అంటున్న వారూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకున్న జనసేన ముప్పయి సీట్లు తీసుకుని అందులో సగం గెలిచినా ఈసారి అసెంబ్లీలో తనదైన పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది అని అంటున్నారు.