ఆ రెండు నియోజకవర్గాల్లోనూ జనసేనకు క్లారిటీ.. ఇదే ఫైనల్!
కూటమిలో భాగంగా జనసేనకు ఫైనల్ గా 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు కన్ ఫాం అయిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 27 March 2024 9:49 AM GMTకూటమిలో భాగంగా జనసేనకు ఫైనల్ గా 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు కన్ ఫాం అయిన సంగతి తెలిసిందే. అయితే... ఆ 21 అసెంబ్లీ స్థానాల్లోనూ మరో స్థానం కూడా జనసేన త్యాగం చేయడం తప్పదని అంటున్నారు. ఆ సంగతి కాసేపు పక్కనపెడితే... తమకున్న 21 స్థానాల్లోనూ ఇప్పటివరకూ 18 మంది అభ్యర్థులనూ ప్రకటించగా.. మిగిలిన స్థానాలను పెండింగులో పెట్టింది. ఈ నేపథ్యంలో రెండు స్థానాల్లో ఫైనల్ డెసిషన్ వచ్చిందని అంటున్నారు.
అవును... కూటమిలో భాగంగా... జనసేన ముందు 24 అసెంబ్లీ 3 లోక్ సభ స్థానాలు దక్కగా.. బీజేపీ ఎంట్రీతో అవికాస్తా 21 అసెంబ్లీ 2 లోక్ సభ స్థానాలు అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే 18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే పిఠాపురంలో తాను పోటీ చేస్తున్నట్లు, కాకినాడ లోక్ సభ స్థానం నుంచి ఉదయ్ పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. అమిత్ షా ఆదేసిస్తే తామిద్దరం పరస్పరం టిక్కెట్లు మార్చుకుంటామని వెల్లడించారు.
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెండింగ్ లో ఉన్న రెండు నియోజకవర్గాల్లోనూ అవనిగడ్డ అసెంబ్లీ, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారూ చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా విక్కుర్తి శ్రీనివాస్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక్కడ ఇంటర్నల్ గా కాస్త గట్టిపోటీయే ఉన్నట్లు చెబుతున్నా... ఫైనల్ గా శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది!
ఇక మచిలీపట్నం లోక్ సభ విషయంలో మొదట్లో క్లారిటీ ఉన్నప్పటికీ మధ్యలో కాస్త విభన్నమైన కథనాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి అని చెప్పినా... అనకాపల్లి నియోజకవర్గం నాబాబుకు మిస్ అవ్వడంతో మరో చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా బాలశౌరిని అవనిగడ్డకు పంపించి, మచిలీపట్నాన్ని నాగబాబుకు కేటాయిస్తారనే కథనాలొచ్చాయి.
అయితే.. ఫైనల్ గా ఆ ఊహాగాణాలన్నింటికీ తెరదించుతూ... మచిలీపట్నం జనసేన లోక్ సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బాలశౌరిని కన్ ఫాం చేసినట్లు సమాచారం. బీజేపీ 11 వ టిక్కెట్ అడుగున్నట్లు కథనాలొస్తున్న నేపథ్యంలో... ఆ డిస్కషన్స్ అనంతరం వీరి ప్రకటన అధికారికంగా ఉండొచ్చని తెలుస్తుంది!