Begin typing your search above and press return to search.

జ‌న‌సేన అభ్య‌ర్థుల ఖ‌రారు.. ప‌వ‌న్ ఎక్స‌ర్‌సైజ్ స్టార్ట్‌

ఈ క్ర‌మంలో గురువారం.. ఆయా జిల్లాల నేతలను పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 11:30 AM GMT
జ‌న‌సేన అభ్య‌ర్థుల ఖ‌రారు.. ప‌వ‌న్ ఎక్స‌ర్‌సైజ్ స్టార్ట్‌
X

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి దాదాపు 30 అసెంబ్లీ, 3 పార్ల‌మెంటు స్థానాల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇప్ప‌టికే రెండు అసెంబ్లీ, ఒక పార్ల‌మెంటు స్థానానికి అభ్య‌ర్థుల‌ను ఎనౌన్స్ చేశారు. రాజాన‌గ‌రం, రాజోలు, మ‌చిలీప‌ట్నం ఎంపీ సీటును కూడా ఖ‌రారు చేసిన ఆయ‌న మిగిలిన వాటిపై దృష్టి పెట్టారు. వాస్త‌వానికి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో పవ‌న్ పర్య‌ట‌న సాగాల్సి ఉంది.

ఆయా జిల్లాల్లోనే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది. కానీ, హెలికాప్ట‌ర్ ల్యాండిగ్ విష‌యంపై ప్ర‌భు త్వం నుంచి అడ్డంకులు ఎదురైన నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న వ్యూహాన్ని మంగ‌ళ‌గిరికి మార్చుకు న్నారు. ప్ర‌స్తుతానికి జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌ను ఆయ‌న వాయిదా వేసుకున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన నాయ‌కుల‌ను మంగ‌ళ‌గిరికి ర‌ప్పించుకుని ఇక్క‌డే స‌మీక్ష చేస్తున్నారు. అభ్య‌ర్థుల‌ను కూడా ఇక్క‌డే ఖ‌రారు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో గురువారం.. ఆయా జిల్లాల నేతలను పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. దీంతో భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల కు చెందిన నాయ‌కులు మంగ‌ళ‌గిరికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు మంగ‌ళ‌గిరిలోని కేంద్ర కార్యాల‌యంలోనే సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం పవన్ రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కళ్యాణ్ ఒక నిర్ణ‌యానికి రానున్న‌ట్టు తెలుస్తోంది.

రాజ‌మండ్రి రూర‌ల్‌పై..

ఆది నుంచి కూడా జ‌న‌సేన రాజ‌మండ్రి రూర‌ల్ టికెట్‌పై ఆశ‌లు పెట్టుకుంది. ఇక్క‌డ నుంచి పార్టీ ము్ఖ్య నాయ‌కుడు.. కందుల దుర్గేష్‌ను పోటీకి పెట్టాల‌ని భావించింది. అయితే.. టీడీపీ మొద‌ట్లో ఈ టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపినా.. సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి.. ఇదే లాస్ట్ చాన్స్ అని తేల్చి చెప్ప‌డంతో ఈ సీటు విష‌యంలో టీడీపీ ఆయ‌న‌కే కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. దీంతో ఇప్పుడు కందుల దుర్గేష్‌కు వేరే నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారిస్తున్నారు. దాదాపు ఆయ‌న‌ను రాజాన‌గ‌రం పంపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.