Begin typing your search above and press return to search.

ఈయన వైసీపీ అభ్యర్థి కాదు సుమా... జనసేన క్యాండిడేట్!

ఇప్పుడు చెప్పుకుంటున్న విషయం ఇటువంటిది కాకపోయినా... ఆశ్చర్యం కలిగించేదని మాత్రం చెప్పొచ్చు

By:  Tupaki Desk   |   25 March 2024 5:17 AM GMT
ఈయన వైసీపీ అభ్యర్థి కాదు సుమా... జనసేన క్యాండిడేట్!
X

సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొంతమంది అభ్యర్థులు పార్టీలు ఫిరాయించడం అన్నది సర్వసాధారణమైన విషయంగా మారిపోయిన రోజులివి! టిక్కెట్టే కమిట్ మెంట్ గా మారిన పరిస్థితులు నేటి రాజకీయాల్లో ఉన్నాయి! ఈ క్రమంలో నిన్నటి వరకూ ఎవరినైతే తిడతారో వారితోనే చెరి కండువా కప్పించుకోవడం రాజకీయాల్లో మరీ సాధారణం అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు చెప్పుకుంటున్న విషయం ఇటువంటిది కాకపోయినా... ఆశ్చర్యం కలిగించేదని మాత్రం చెప్పొచ్చు!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో విపక్షాలు అన్నీ ఏకమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీతో జనసేన, బీజేపీలు జతకట్టాయి. పరిస్థితులు నాటివి కాకపోయినా ఇలా 2014 తరహాలో కూటమి బరిలోకి దిగుతున్న వేళ జగన్ ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో 175 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచార కార్యక్రమాలకు తెరలేపారు! ఇదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేనలు కూడా తమ తమ అభ్యర్థులను ప్రకటించేస్తోన్నాయి!

ఈ నేపథ్యంలో తాజాగా జనసేన ప్రకటించిన అబ్యర్థుల జాబితాలో తెరపైకి వచ్చిన ఒక పేరు, ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. దీంతో... ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుందని అంటున్నారు పరిశీలకులు! కారణం... తాజాగా జనసేన విడుదల చేసిన 18 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి యనమల భాస్కర్ రావు పేరు ప్రకటించారు.

అయితే... ఆ భాస్కర రావుకి వైసీపీ నేతలతో.. ప్రధానంగా జగన్ తోనూ, వైసీపీలో అత్యంత కీలకమైన పెద్దిరెడ్డి ఫ్యామిలీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపే కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదే సమయంలో సుమారు గత 13 ఏళ్లుగా తాను జగన్ కి విధేయుడిగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాస్కర్ ప్రకటించుకున్న పరిస్థితి! అయినప్పటికీ... అతను వైసీపీ నుంచి ఎలాంటి పదవినీ పొందలేదు!

ఈ నేపథ్యంలో ఆయన హఠాత్తుగా అన్నట్లుగా ఎన్నికల ముందు జగన్ శిబిరానికి దూరమై జనసేనలో చేరారు. వెంటనే అనూహ్యంగా అన్నట్లుగా ఆ పార్టీ రైల్వే కోడూరు టిక్కెట్ దక్కించుకున్నారు. ఇది కచ్చితంగా ఆశ్చర్యకరమైన విషయమే అని అంటున్నారు పరిశీలకులు. కాగా... వైసీపీ రైల్వే కోడురు అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.