Begin typing your search above and press return to search.

"ఉచిత టీ" ప్రచారం షురూ చేసిన జనసేన!

ఇందులో భాగంగా.. ప్రజలకు ఉచితంగా టీ పంపిణీ చేస్తుంది. అవును... తాడేపల్లిగూడెంలో ఎన్నికల గుర్తును ప్రచారం చేసేందుకు స్థానిక నాయకులు గాజు గ్లాసులలో ఉచితంగా టీ పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   21 Jan 2024 4:30 AM GMT
ఉచిత టీ ప్రచారం షురూ చేసిన జనసేన!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే నాలుగు విడతల్లో పలువురు ఇన్ ఛార్జ్ లను ప్రకటించింది. ఐదో విడత ఫిల్టరింగ్ చేపట్టింది! ఇదే సమయంలో టీడీపీ సైతం తమ అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసిందని చెబుతున్నారు. ఈ క్రమంలో జనసేన తమ ఎన్నికల గుర్తు "టీ గ్లాసు"ను జనాల్లోకి తీసుకెళ్లే పనిలో బిజీ అయిపోయింది. దీనికోసం ఉచిత టీస్టాల్స్ ని ఏర్పాటు చేస్తుంది.

అవును... తన రెండవ ప్రత్యక్ష ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోన్న జనసేన... ఎన్నికల గుర్తు "టీ గ్లాస్"ని ప్రచారం చేయడానికి ఆసక్తికరమైన మార్గాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా.. ప్రజలకు ఉచితంగా టీ పంపిణీ చేస్తుంది. అవును... తాడేపల్లిగూడెంలో ఎన్నికల గుర్తును ప్రచారం చేసేందుకు స్థానిక నాయకులు గాజు గ్లాసులలో ఉచితంగా టీ పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ వెరైటీ ప్రమోషన్ ద్వారా రెండు విధాలుగానూ లాభం ఉందని వారు భావిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఒకటి ప్రజలకు ఉచితంగా తేనీరు అందించడంతోపాటు.. జనాల్లోకి తమ పార్టీ గుర్తును తీసుకెళ్లినట్లు కూడా ఉంటుందని అంటున్నారు. ఫలితంగా జనాల నోళ్లలో టీ గాసు నానుతుందని.. ఫలితంగా ఫలితం ఉంటుందని వారు భావిస్తున్నారని తెలుస్తుంది.

అయితే ఈ తరహా ప్రచారం చేయడం జనసేనకు ఇదే మొదటిసారి కాదు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఆ పార్టీ నేతలు ఇదే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కాకినాడ జనసేన పార్టీ నాయకులు తమ గుర్తును ప్రచారం చేసుకునేందుకు ఉచితంగా టీ పంపిణీ చేశారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల కోసం తాడేపల్లిగూడెంలో జనసేన నేతలు ఈ వ్యూహాన్ని ప్రయోగిస్తున్నారు.

కాగా... ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు తమ పార్టీ గుర్తులను జనాల్లోకి బలంగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ ఎన్నికల గుర్తు ఎప్పటి నుంచో జనాల్లో తీవ్రంగా ప్రచారంలో ఉండగా... వైసీపీ "ఫ్యాన్" కూడా అతితక్కువ సమయంలో జనాల్లోకి బలంగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన కూడా తమ ఎన్నికల గుర్తును జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు తలపెడుతుంది.