Begin typing your search above and press return to search.

రాయలసీమను పక్కన పెట్టి... పవన్ ఫోకస్ అక్కడేనా...?

ఉమ్మడి గోదావరి జిల్లాలలో పవన్ వారాహి యాత్ర ముగిసిన తర్వాత రాయలసీమకు షిఫ్ట్ అవుతారు అని అనుకున్నారు

By:  Tupaki Desk   |   4 Aug 2023 1:30 AM GMT
రాయలసీమను పక్కన పెట్టి... పవన్ ఫోకస్  అక్కడేనా...?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొత్తం ఏపీ అంతా ఆయన తిరగాలని గెలవాలని అనుకోవడం లేదు. తమ పార్టీ పట్టు ఉన్న చోట్ల మాత్రమే అభ్యర్ధులను నిలబెట్టడం ద్వారా మంచి నంబర్ తో గెలవాలని పవన్ చూస్తున్నారు. అందుకు గానూ ఆయన తన కార్యక్షేత్రాన్ని చక్కగానే ఎంచుకున్నారని అంటున్నారు.

ఉమ్మడి గోదావరి జిల్లాలలో పవన్ వారాహి యాత్ర ముగిసిన తర్వాత రాయలసీమకు షిఫ్ట్ అవుతారు అని అనుకున్నారు. కానీ ఆయన ఉత్తరాంధ్ర వైపు వారాహి రధాన్ని మళ్ళించారు. అంటే ఈ ప్రాంతంలోనే జనసేన జెండా పాతాలని పవన్ గట్టిగా డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

ఉత్తరాంధ్రాలో కాపులు విశాఖ నగరంలోనే ఉన్నారు. విశాఖ రూరల్, విజయనగరం, శ్రీకాకుళంలలో తూర్పు కాపుల పేరిట వారే ఉన్నారు. అలా వారంతా బీసీలు కింద వస్తారు. మొత్తం ఉత్తరాంధ్రాలో 34 ఎమ్మెల్యే అయిదు ఎంపీ సీట్లు ఉంటే సగానికి పైగా సీట్లలో తూర్పు కాపులదే ప్రాబల్యంగా ఉంది అని చెప్పాలి.

దీంతో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రాలో కనీసం పొత్తులలో భాగంగా పదిహేను సీట్ల దాకా తీసుకోవాలని చూస్తున్నారు అని తెలుస్తోంది. అందుకే ఆయన మూడవ విడత విశాఖ జిల్లాను ఎంచుకున్నారు. ఆ తరువాత నాలుగవ విడత అయిదవ విడత కూడా శ్రీకాకుళం విజయనగరంలలో సాగుతుంది అని అంటున్నారు.

ఇక ఉమ్మడి గోదావరి జిల్లాలలో జనసేన 20 దాకా సీట్లు కోరుకుంటోంది. అంటే అక్కడికి 35 చోట్ల పోటీకి జనసేన రెడీ అన్న మాటలు అలా గుంటూరు, క్రిష్ణా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి దాకా చూసుకుంతే మరో పది సీట్లను పొత్తులలో భాగంగా అడగవచ్చు. ఇక మిగిలిన రాయలసీమ జిల్లాలో అయిదు సీట్లు వేసుకున్నా టోటల్ గా 50 సీట్లకు పోటీకి జనసేన రెడీ అవుతోంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే జనసేన బలమైన పునాది వేయడానికే ఉత్తరాంధ్రా గోదావరి జిల్లాలను ఎంచుకుంది అని అంటున్నారు. ఒక విధంగా ఈ ప్రయోగం కర్నాటకలోని జేడీఎస్ పార్టీ నుంచే చూసి అనుకోవాలని అంటున్నారు. అంటే అక్కడడ కూడా 2018 ఎన్నికల్లో 38 సీట్లు గెలిచి సీఎం సీటుకు జేడీఎస్ గేలం వేసి సక్సెస్ అయింది.

ఇపుడు యాభై సీట్లకు పోటీ చేయడం ద్వారా కనీసం నలభై అయినా గెలుచుకుంటే ఏపీలో మ్యాజిక్ ఫిగర్ కి ఏ పార్టీనీ చేరువ కాకుండా ఉంచవచ్చు అని తలపోస్తోంది. అలా జరిగితే తామే కింగ్ మేకర్ అయి ఆ మీదట కింగ్ అవుతామని జనసేన లెక్కలు వేస్తోంది. అయితే జనసేనకు టీడీపీ ఇన్నేసి సీట్లు ఇస్తుందా అన్నది ఒక ప్రశ్న అయితే ఇన్ని సీట్లు ఇచ్చినా కూడా టీడీపీ నుంచి ఓట్లు సవ్యంగా బదలాయింపు అవుతాయా అన్నది మరో ప్రశ్న.

ఏది ఏమైనా 2019కి 2024 కి మధ్య జనసేనాని ప్లాన్స్ రియాలిటీకి దగ్గరగా ఉన్నాయని అంటున్నారు. ఆయన రాయలసీమను పక్కన పెట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారు. అది కూడా తనకు పట్టున్న చోట్ల రాజకీయానికి మరింత పదును పెట్టాలని భావిస్తున్నారు. మరి జనసేనాని ఈ వ్యూహాం తో హిట్ అవుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.