Begin typing your search above and press return to search.

విశాఖ టూ కోస్తా దాకా...జనసేన లెక్క పక్కా...!

మూడవ పార్టీగా తాము బలంగా ఉండాలంటే 2024 ఎన్నికలు ఒక సోపానంగా వాడుకోవాల ని జనసేన చూస్తోంది.

By:  Tupaki Desk   |   29 July 2023 12:30 AM GMT
విశాఖ టూ కోస్తా దాకా...జనసేన లెక్క పక్కా...!
X

ఏపీ లో మూడవ పార్టీగా బలంగా ఎమర్జ్ కావాలన్నది జనసేన వ్యూహం. ఈ విషయం లో మొహమాటం లేకుండానే ఆ పార్టీ తన పని తాను చేసుకుని పోతోంది. అందుకే సీట్ల దగ్గర పేచీ రావచ్చు అంటున్నారు. ఏపీ లో వైసీపీ టీడీపీ మాత్రమే పార్టీలు ఉన్నాయి. మూడవ పార్టీగా తాము బలంగా ఉండాలంటే 2024 ఎన్నికలు ఒక సోపానంగా వాడుకోవాల ని జనసేన చూస్తోంది.

ఏపీ లో వైసీపీ ని గద్దె దించడం మాత్రమే జనసేన లక్ష్యం కాదు. దానితో పాటు తాను కూడా ఎదగాలని, కొత్త ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాల ని భావిస్తోంది. అదే విధంగా ఏపీ రాజకీయాల్లో ప్రభావితం చేసేలా వీలైతే రానున్న మరిన్ని ఎన్నికల్లో అధికారం పూర్తి మెజారిటీతో చేపట్టే దిశగా జనసేన ప్రణాళికలు వేసుకుంటోంది.

దాంతోనే ఇపుడు తన పాత్రకు ఏ మాత్రం కుదించుకోవడానికి ఇష్టపడడంలేదని అంటున్నారు. పొత్తుల కు జనసేన సుముఖం. అది కూడా టీడీపీ తో కలసి వెళ్ళేందుకు ఇంకా సుముఖం అన్నది ప్రచారంలో ఉన్న మాట. బీజేపీ టీడీపీల ను చెరో వైపు ఉంచుకుంటూ ఈ మూడు పార్టీల కలయికతో ఏపీలో బలమైన కూటమిగా మారి వైసీపీ ని గద్దె దించాలన్నదే జనసేన మాస్టర్ ప్లాన్.

అయితే ఈ మొత్తం వ్యవహారం లో తాను ఎక్కడా నష్టపోకుండా జనసేన వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. తన పార్టీ బలం ఉన్న చోట జనసేన ను నమ్ముకున్న సైనికులు ఉన్న చోట కచ్చితంగా వారి కోసం సీట్ల కోసం పట్టుబట్టాలనే భావిస్తోంది. దాని కోసం పొత్తుల విషయంలో తగ్గేదే లే అన్నట్లు ఉంది.

అలా తీసుకుంటే విశాఖ లో భీమిలీ, గాజువాక. పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి సీట్లను జనసేన కోరుకుంటోంది. విజయనగరం, శ్రీకాకుళం కలిపి మొత్తం 19 సీట్లు ఉంటే ఇందులో కూడా ఒక అయిదు సీట్లను జనసేన పొత్తుల లో తీసుకునే చాన్స్ ఉంది. ఆయా సీట్లను గుర్తించారు అని అంటున్నారు.

అలాగే గోదావరి జిల్లాల లో ఉన్న మొత్తం 34 సీట్లలో కనీసంగా ఇరవై సీట్లకు టెండర్ పెట్టేలాగానే వారాహి దూకుడు సాగింది. ఇక గుంటూరు లో తెనాలి, గుంటూర్ ఈస్ట్, వెస్ట్, ప్రత్తిపాడు సీట్ల మీద జనసేన కన్ను ఉందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా ఇక్కడ జనసేనకు మంచి ఓట్లు వచ్చాయని లెక్కలు చెబుతున్నారు.

క్రిష్ణా జిల్లాలో చూసుకుంటే విజయవాడ తూర్పు సీటుతో పాటు, మచిలీపట్నం, విజయవాడ వెస్ట్ సీట్ల మీద జనసేన చూపు ఉంది అని అంటున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో పర్చూరు, ఒంగోలు, దర్శి, చిత్తూరు జిల్లాలో తిరుపతి, నగరి కడప, కర్నూల్, అనంతపురంల లో జిల్లాకు రెండు సీట్లు వంతున ఆరు సీట్ల దాకా తీసుకోవాలన్నది జనసేన ప్లాన్ అని అంటున్నారు.

ఈ విధంగా చూసుకుంటే టోటల్ గా యాభై సీట్లు జనసేన కు పొత్తులో టీడీపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మాజీ మంత్రులు సీనియర్ నేతలు తెలుగుదేశం నుంచి త్యాగాల కు సిద్ధపడాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఆ దిశగా తెలుగుదేశం నుంచి సర్దుబాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే మరో వైపు నుంచి చూస్తే మాత్రం జనసేన కోరుకున్న సీట్లలో టీడీపీ గట్టిగా ఉండడం వల్ల ససేమిరా అనే పరిస్థితి కూడా ఉంది.

మరి ఈ సీట్ల చిక్కుముడిని విప్పితేనే తప్ప పొత్తుల కధ కొలిక్కి వచ్చే అవకాశం లేదు ఇంకో విషయం ఏంటి అంటే జనసేన కోరుకుంటున్న సీట్ల జాబితా టీడీపీ వద్ద ఉంది అని అంటున్నారు. అందులో సగానికి సగం టీడీపీ ఇవ్వలేనివిగా ఉనాయని అంటున్నారు. మరి దీని మీద ఎవరు తగ్గుతారు. ఎవరు నెగ్గుతారు అన్న దాని బట్టే ముందు ముందు పరిణామాలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు.