Begin typing your search above and press return to search.

టీడీపీ - జనసేన కో ఆర్డినేషన్ మీటింగులలో కొంత రచ్చ!

ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఫలితాలు రిపీట్ కాకూడదని.. 2014 తరహాలో సత్తా చాటాలని టీడీపీ - జనసేన కలిసే ఈ సారి ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Nov 2023 8:36 AM GMT
టీడీపీ - జనసేన కో ఆర్డినేషన్ మీటింగులలో కొంత రచ్చ!
X

ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఫలితాలు రిపీట్ కాకూడదని.. 2014 తరహాలో సత్తా చాటాలని టీడీపీ - జనసేన కలిసే ఈ సారి ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ సమావేశాల్లో కొన్ని చోట్ల సరికొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి! దీంతో ఇలాంటి పరిణామాల వల్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


అవును... టీడీపీ జనసేన కో ఆర్డినేషన్ మీటింగులలో సరికొంత రచ్చ అక్కడకక్కడ సాగుతోంది. దీంతో పార్టీ నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి! ఇందులో భాగంగా తాజాగా అనకాపల్లిలో జరిగిన టీడీపీ - జనసేన సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ సమావేశం అనకాపల్లి టీడీపీ ఇన్ ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, జనసేన ఇన్ ఛార్జ్ పరుచూరి భాస్కరరావుల ఆద్వర్యంలో జరిగింది.

అయితే ఈ సమన్వయ కమిటీ మీటింగ్‌ లో జనసేన నేతలు ఆ పార్టీ స్థానిక నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు! దీంతో గందరగోళం నెలకొంది! ఈ సందర్భంగా తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కొందరు నేతలు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో భాస్కర రావు తీరుని తప్పుపట్టారు. దీంతో గందరగోళం ఏర్పడింది.

ఇలా ఎంతో కీలకంగా ఇరు పార్టీల పొత్తుకూ ఉపయోగపడుతుందని భావించి ఏర్పాటు చేసిన సమావేశం కాస్తా రసాభాసగా మారిపోయ్యింది. ఇలా రెండు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదంతో సమన్వయ కమిటీ మీటింగ్ తో కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయనే చర్చ మొదలైంది.

ఈ క్రమంలో ఎట్టకేలకు ఇరువర్గాలని శాంతింపచేయడంతో వ్యవహారం అప్పటికి ఒక కొలిక్కి వచ్చింది. దీంతో... ఈ సమన్వయ కమిటీ మీటింగ్ పుణ్యమాని అనకాపల్లి జనసేనలో రెండు వర్గాలు బయటపడ్డాయని అంటున్నారు కార్యకర్తలు! దీంతో... విశాఖ రూరల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు సీరియస్ అయ్యారు!

ఇందులో భాగంగా... అనకాపల్లిలో జరిగిన నియోజకవర్గం జనసేన - టీడీపీ పార్టీల సమావేశంలో పార్టీ క్రమశిక్షణ చర్యలకు పాల్పడినందుకు.. మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో మూడు రోజుల్లో తెలియజేయాల్సిందిగా ముళ్ల శ్రీనివాస రావుని ఆదేశించారు రమేష్ బాబు! మరి ఆయన ఎలాంటి వివరణ ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.