మరో తొమ్మిది స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఖరారు!
రానున్న ఎన్నికల్లో టీడీపీ - బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన.. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 March 2024 4:33 AM GMTరానున్న ఎన్నికల్లో టీడీపీ - బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన.. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల సార్దుబాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని.. అనంతరం కందుల దుర్గేష్ కు నిడదవోలు కేటాయించారు! అలా ఆరుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరొ 9 పేర్లను కన్ ఫాం చేసినట్లు తెలుస్తుంది.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలూ దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 94 మంది అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదే సమయంలో ఇప్పటికే 12 విడతల్లో సుమారు 70కి పైగా అభ్యర్థులను అసెంబ్లీకి, 23 మంది అభ్యర్థులను లోక్ సభ కు కేటాయించిన జగన్... ఈ నెల 16న ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా మొత్తం అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా పార్టీ అభ్యర్థులు, నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని వారికి దిశానిర్ధేశం చేశారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులతో పాటు.. మరికొంతమంది నేతలతోనూ ఆయన మంగళగిరి ఆఫీసులో ముఖాముఖీ చర్చించారు. ఈ సందర్భంగా ఆ భేటీకి హాజరైన వారే అభ్యర్థులు అని తెలుస్తుంది. ఇందులో భాగంగా మరో 9 పేర్లు తెరపైకి వస్తున్నాయి.
ఇందులో భాగంగా... ఇప్పటికే ప్రకటించిన ఆరుగురు అభ్యర్థులతో పాటు ఈ రోజు మరో తొమ్మిది మంది అభ్యర్థులను జనసేనాని ప్రకటించనున్నారని తెలుస్తుంది. వారి వివరాలు ఇలా ఉన్నాయని అంటున్నారు.
పెందుర్తి - పంచకర్ల రమేష్
ఎలమంచిలి – విజయ్ కుమార్
విశాఖ సౌత్ - వంశీకృష్ణ యాదవ్
తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్
ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
నరసాపురం - బొమ్మిడి నాయకర్
భీమవరం - రామాంజనేయులు
రాజోలు - దేవ వరప్రసాద్
తిరుపతి - ఆరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వాలను జనసేనాని కన్ ఫాం చేశారని.. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ రోజు అధికారిక ప్రకటన ఉండొచ్చని సమాచారం.