Begin typing your search above and press return to search.

డబ్బుల్లో జనసేన సరితూగుతోందా?

మామూలుగానే వైసీపీ జనాలకు బాగా డబ్బులు పంచుతుందనే పేరుంది. అందులోనూ ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది.

By:  Tupaki Desk   |   12 May 2024 1:18 PM GMT
డబ్బుల్లో జనసేన సరితూగుతోందా?
X

జీరో బడ్జెట్ పాలిటిక్స్ పేరుతో రాజకీయాల్లోకి వచ్చింది జనసేన. కానీ ఈ రోజుల్లో అది ఆచరణ సాధ్యం కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ మొదట్లో ఇచ్చిన పిలుపును తమ పార్టీ నాయకులు తప్పుగా అర్థం చేసుకున్నారని.. తమ వెంట తిరిగే వారికి తిండి పెట్టి, టీలు ఇవ్వడం కూడా మానేశారని.. ఇలా అయితే ఎవరు తిరుగుతారని ఆ మధ్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బలం ఉన్న వాళ్లు డబ్బులు బాగా ఖర్చు పెట్టాలని, లేకుంటే ప్రస్తుత రాజకీయాల్లో నెగ్గుకు రాలేమని పవన్ స్పష్టం చేశాడు. అందుకు అనుగుణంగానే ఈసారి ఆర్థికంగా కూడా కొంచెం బలం ఉన్న అభ్యర్థులను నిలబెట్టాడు పవన్. అంతే కాక వేరే పార్టీల నుంచి వచ్చి జనసేనలో చేరి పోటీ చేస్తున్న వారిలోనూ స్థితిమంతులు ఉన్నారు.

మామూలుగానే వైసీపీ జనాలకు బాగా డబ్బులు పంచుతుందనే పేరుంది. అందులోనూ ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది. అలాంటపుడు కానుకల రూపంలో ఓటర్లకు బాగానే ముట్టజెప్పకుండా ఉండరు. ఏపీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రాంతాన్ని బట్టి అధికార పార్టీ ఓటుకు 1500 నుంచి 5000 దాకా ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ చాలా చోట్ల అందుకు దీటుగా డబ్బులు పంచుతున్నట్లు చెబుతున్నారు. పక్కాగా ఒక పార్టీ అని ముద్ర పడిన వాళ్లు తప్ప.. చాలా మంది ఓటర్లు ఇరు పార్టీల నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జనసేన వైపు నుంచి కూడా ఓటర్లకు కొన్ని చోట్ల డబ్బులు అందుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీ నుంచి అభ్యర్థులకు డబ్బులు వెళ్లడం లేదు కానీ.. ఆ పార్టీ తరఫున నిలబడుతున్న వాళ్లలో బలం ఉన్న వాళ్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. అలాగే కూటమి నుంచి కూడా ఆర్థిక సహకారం అందుతోంది. వైసీపీకి దీటుగా అయితే డబ్బులు ఇవ్వట్లేదు కానీ.. పలు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల నుంచి ఓటర్లకు తాయిలాలు అందుతున్నట్లు తెలుస్తోంది.