ఏందయ్యా ఇది... ఉద్యోగులకు హ్యంగోవర్ లివా?
ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో కాదు అన్ని విషయాల్లోను వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 12 Feb 2025 10:30 PM GMTహ్యాంగోవర్ అనే పదం వింటేనే.... ఇంటా బయటా కొడతారు అని చాలా మంది ఫీలింగ్. అంత ఎందుకు చేశవ్ అంటారు తెలియని స్నేహితులు. కాని.. ప్రతీ ఒక్కరూ అలా ఆలోచించరుగా.. అవ్వొచ్చు..! ఓ కంపెనీ కూడా అలనే ఆలోచించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో కాదు అన్ని విషయాల్లోను వైరల్ గా మారింది.
అవును... సంస్థను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు సంస్థలు సరికొత్త విధానాలను అనుసరిస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఎక్కువ ప్యాకేజీ ఇవ్వడం, వివిధ రకాల లీవ్ లు, పార్టీలు, లంచ్ / డిన్నర్ చేశాక కాసేపు కునుకు తీసేందుకు స్లీపింగ్ అవర్స్ తదితర ఏర్పాట్లు చేస్తుంటారనే ఇటీవల వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో.. జపాన్ కు చెందిన ట్రస్ట్ రింగ్ అనే సంస్థ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఆలోచించింది. ఇందులో భాగంగా.. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా తాగినంత ఆల్కహాల్ ను అందిస్తోంది. అంతేకాకుండా హ్యాంగోవర్ లీవ్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం!
ప్రధానంగా... ఉద్యోగుల్లో ఎవరైనా అధికంగా మద్యం తాగితే ఈ లీవ్ ను ఉపయోగించుకొని మత్తు దిగాక తిరిగి విధుల్లో చేరవచ్చు. దీంతో... ఈ హ్యాంగోవర్ లీవ్ తమకు బాగా ఉపయోపగడుతోందని కంపెనీ ఉద్యోగులు పేర్కొనడం గమనార్హం. దీంతొ... దీన్ని వినియోగించుకొని రెండు లేదా మూడు గంటలు హాయిగా నిద్రపోయి ఆఫీసుకు వస్తున్నామని చెబుతున్నారంట స్టాఫ్.
ఇక్కడ్ ట్విస్ట్ ఏమిటంటే... ఉద్యోగంలో చేరిన ప్రారంభంలోనే ఎక్కువ వేతనం ఇచ్చుకోలేకే ఈ ప్రత్యామ్నాయం ఏర్పాటుచేసినట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించిందంట..!