Begin typing your search above and press return to search.

మీమ్‌ డాగ్‌ "చిమ్‌ టూ" ఇక లేదు... నెట్టింట హాట్ టాపిక్!

ఇదే క్రమంలో మీమ్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన జపనీస్‌ శునకం కబోసు కన్నుమూసింది.

By:  Tupaki Desk   |   24 May 2024 11:30 PM GMT
మీమ్‌  డాగ్‌ చిమ్‌  టూ ఇక లేదు... నెట్టింట హాట్  టాపిక్!
X

సోషల్ మీడియాలో "వైరల్ డాగీ"గా పేరు పోందడమే కాకుందా... క్రిప్టో కరెన్సీ డాగీ కాయిన్ లోగోపైనా ఫోటోగా స్థానం సంపాదించుకున్న శునకం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇదే క్రమంలో మీమ్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన జపనీస్‌ శునకం కబోసు కన్నుమూసింది. ఈ మేరకు ఈ డాగ్ మరణాన్ని ఎక్స్ లో ధృవీకరించారు.

అవును... సోషల్‌ మీడియాలో "వైరల్‌ డాగీ"గా పేరు పొందిన కబోసు మరణించినట్లు డాగీ కాయిన్‌ క్రిప్టోకరెన్సీ తన ఎక్స్‌ ఖాతా ద్వారా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఈ డాగ్ లుకేమియాతో బాధపడుతుందని.. మరణానికి అదే కారణమని వెల్లడించారు. ఈ సందర్భంగా... "మా కమ్యూనిటీ భాగస్వామి, స్నేహితురాలు కబోసు ప్రశాంతంగా కన్నుమూసింది" అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... ప్రేమకు చిరునామాగా మారి, మీమ్‌ వరల్డ్‌ లో తనదైన ముద్రవేసి, ఎప్పుడూ మీ గుండెల్లో నిలిచిపోయిందంటూ డాగీకాయిన్‌ ఎక్స్‌ లో పోస్ట్‌ చేసింది. మీమ్‌ వరల్డ్‌ లో భారతీయ నెటిజన్లకు "చిమ్‌ టూ"గా ఈ డాగ్ సుపరిచితమనే సంగతి తెలిసిందే. ఈ శునకం థీమ్‌ తో రూపొందించిన మీమ్స్‌ నెట్టింట విపరీతంగా వైరల్‌ అయ్యాయి.

ప్రధానంగా... క్రికెట్‌, సినిమా, పాలిటిక్స్, యూత్‌ అంశాలు, వైఫ్ & హస్బెండ్, లవర్స్ మధ్య జోక్స్ ను చిమ్‌ టూ ఫొటోలతో మీమర్స్‌ రూపొందించేవారు. ఇదే సమయంలో పలు సోషల్ యాప్స్ లో సైతం చిమ్‌ టూ స్టిక్కర్లు అందుబాటులో ఉండేవి.

కాగా... 2010 నుంచి కబోసు చిత్రాలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉండేవి. ఈ సమయంలో దీన్నో జోక్‌ గా తీసుకున్నారు కానీ... 2013లో క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌ మొదలు పెట్టినప్పుడు కబోసును ప్రొఫైల్‌ పిక్‌ గా తీసుకోవడంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.