నైట్ షిప్ట్ లు నిషేదిస్తే... ఆ దేశ జనాభా పై ప్రభావం పడిందంట!
తాము ఉత్పాదకత పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయం బర్త్ రేట్ పై ప్రభావం చూపుతుందని తామనుకోలేదని
By: Tupaki Desk | 18 July 2023 3:58 AM GMTఒక కంపెనీ నైట్ షిప్ట్ లు తీసేయాల ని నిర్ణయించుకుందట. ఇదే సమయం లో పనిగంటలు కూడా తగ్గించిందని తెలుస్తుంది. ఇదంతా ఉత్పాదకత పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారట. దీంతో ఒకందుకు నైట్ షిఫ్ట్ లు నిషేధిస్తే మరొక ఫలితం వచ్చిందని తెలుస్తుంది.
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్ లో జనాభా సంక్షోభం ముదురుతోందంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. 2022లో దేశం లోని మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 1.26 కనిష్టానికి పడిపోయిందని అంటున్నారు. ఈ తరుణం లో ఆ దేశానికి చెందిన ప్రముఖ సంస్థ ఇటోచు కార్పొరేషన్ 10 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంతో మహిళా ఉద్యోగుల సంతాన సాఫల్య రేటు పెరిగినట్లు తెలుస్తోంది.
అవును... 2010లో జపాన్ ట్రేడింగ్ కంపెనీ ఇటోచు కార్ప్ సీఈవోగా మషిహిరో ఒకఫుజి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారంట. అందులో భాగంగా… ఆ సమయం లో ఆఫీస్ లో ప్రొడక్టివిటీని పెంచేందుకు పనిగంటల్ని తగ్గించడంతోపాటు.. నైట్ షిఫ్ట్ లను కూడా రద్దు చేశారట. దీంతో ఇటోచు నిర్ణయం ఆ సంస్థ స‍్వరూపాన్నే మార్చేసిందని తెలుస్తుంది.
2010 నుంచి 2021 వరకూ భారీ లాభాల్ని ఆర్జించడంతోపాటు.. మెటర్నిటీ లీవ్ లు తీసుకున్న మహిళా ఉద్యోగులు తిరిగి విధుల్లోకి వస్తున్నారట. దీంతో జపాన్ లో సగటు సంతాన రేటు దేశం లోని మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 1.26 కాగా... ఈ కంపెనీ ఉద్యోగినులు 1.3 ను అధిగమించారట.
ఇదే సమయంలో ఇటీవల ఉద్యోగుల కు వారానికి రెండు రోజులు ఇంటినుంచి పనిచేసేందుకు ఇటోచు అనుమతించడంతో పాటు కార్యాలయ పని గంటల ను ఎనిమిది నుంచి ఆరు గంటల కు కుదించిందట. మరి కొన్ని సమయాల్లో ఓవర్ టైమ్ ను కూడా రద్దు చేశారట. ఈ క్రమంలో నైట్ షిప్ట్ లు తీసేయడంతో పలువురు మహిళా ఉద్యోగులు మెటర్నిటీ లీవులు తీసుకుని పిల్లలను కని తిరిగి పని చేసేందుకు వస్తున్నారంట.
దీంతో… తాము ఉత్పాదకత పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయం బర్త్ రేట్ పై ప్రభావం చూపుతుందని తామనుకోలేదని ఈ సందర్భంగా... ఇటోచు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫుమిహికో కొబయషి చెబుతున్నారని తెలుస్తుంది.