Begin typing your search above and press return to search.

స్పేస్ వాక్ చేసిన 'స్కూల్ డ్రాపౌట్' బిలియనీర్ ఇంట్రస్టింగ్ విషయాలు!

ఈ సమయంలో ఇందులో కీలక భాగమైన బిలియనీర్ జేర్డ్ ఇస్సాక్ మన్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   16 Sep 2024 8:30 PM GMT
స్పేస్  వాక్  చేసిన స్కూల్  డ్రాపౌట్ బిలియనీర్  ఇంట్రస్టింగ్  విషయాలు!
X

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ ప్రాజెక్టులో భాగంగా తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ ను బిలియనీర్ జేర్డ్ ఇస్సాక్ మన్ తో పాటు పైలట్ స్కాట్ కిడ్ పోటీట్, మిషన్ స్పెషలిస్ట్ అన్నా మొనోన్, సారా గిల్లీస్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... స్పేస్ లో ఈ బృందం ఐదు రోజులపాటు గడిపి 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది.

ఈ సమయంలో ఇందులో కీలక భాగమైన బిలియనీర్ జేర్డ్ ఇస్సాక్ మన్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆయన పాఠశాల విద్యను మద్యలోనే ఆపేశారట. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన ఆయన ఈ విషయాన్ని స్వయంగా వెళ్లడించారు. తాను వ్యాపారవేత్తగా రాణించాలనే ఇష్టంతో స్కూల్ డ్రాపౌట్ చేసినట్లు పేర్కొన్నారు.

ఇక చిన్ననాటి నుంచే బిజినెస్ మ్యాన్ గా ఎదగాలని కలలుకనే ఇస్సాక్ మన్... ఈ ఆసక్తితో 16వ ఏటనే చదువుకు స్వస్థి పలికాడు. అనంతరం పెట్టుబడికి కావాల్సిన 10,000 డాలర్లను తన తాత నుంచి తీసుకొని, తన ఇంట్లోనే సెల్లార్ లో షిఫ్ట్ ఫర్ పేమెంట్స్ అనే స్టార్టప్ ను స్థాపించాడు. అలా మొదలైన కంపెనీ నేడు టాప్ ప్లేస్ లో ఉంది!

ఇక ఈ కంపెనీలో ప్రస్తుతం 2000 మంది ఉపాధి పోందుతున్నారు. దీని మార్కెట్ విలువ 7.4 బిలియన్ డాలర్లు. ఈ క్రమంలోనె... నేడు సంస్థ ఈ స్థాయిలో ఉండటం కోసం తాను, తన స్నేహితుడు ఎంతో శ్రమించినట్లు ఇస్సాక్ మన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో 2009లోనూ సెస్నా సైటేషన్ సీజే2 ఎయిర్ క్రాఫ్ట్ లో 62 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి రికార్డ్ కూడా సృష్టించాడు.

ఇప్పుడు తాజాగా 740 కిలో మీటర్ల ఎత్తులో స్పేస్ వాక్ ను నిర్వహించి మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పైగా... వీరు ప్రయాణించిన అంతరిక్ష నౌక అత్యధికంగా 875 మైళ్ల ఎత్తుకు చేరుకుంది. చంద్రుడిపైకి అపోలో మిషన్ల తర్వాత మానవుడు ఇంత ఎత్తుకు చేరడం ఇదే తొలిసారి. ఇది ఐ.ఎస్.ఎస్., హబుల్ టెలీస్కోప్ కంటే ఎత్తు!