జగన్ పాలన బాగుందా? - ఈ ప్రశ్నకు జయప్రద సమాధానం వింటే షాకే!
ఈ అందరిలా చూడడమే తనను బాధించిందని .. దీంతో తాను.. జాతీయస్థాయిలో రాజకీయాలు చేశానని జయప్రద చెప్పారు
By: Tupaki Desk | 28 April 2024 12:17 PM GMTఒకప్పటి తెలుగు తార.. జయప్రద.. ఆపశోపాలు పడుతున్నారు. ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఉన్న ఆమె.. బీజేపీలో అయితే ఉన్నారు.కానీ, ఆ పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో తరచుగా గత రెండు మాసాల నుంచి ఏపీలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు పిలిస్తే.. ప్రచారానికి వస్తానని కొన్ని రోజుల కిందట కామెంట్లు చేశారు. చంద్రబాబుకు తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్న ఆమె.. పార్టీల్లో అందరిలాగే.. తనను చూశారని చెప్పారు.
ఈ అందరిలా చూడడమే తనను బాధించిందని .. దీంతో తాను.. జాతీయస్థాయిలో రాజకీయాలు చేశానని జయప్రద చెప్పారు. అయినా.. తనకు టీడీపీ అంటే అభిమానమన్న జయప్రద.. పిలిస్తే.. ప్రస్తుత ఎన్ని కల్లో టీడీపీ నేతలకు ప్రచారం చేస్తానని జయప్రదంగా చెప్పారు. కానీ, రోజులు, వారాలు గడిచిపో యి.. పోలింగ్‌కు కూడా తేదీలు దగ్గర పడుతున్నాయి. కానీ, టీడీపీ నుంచి ఎలాంటి ఆహ్వానాలు అందలేదు. దీంతో ఇప్పుడు యూటర్న్ తీసుకున్న జయప్రద.. బీజేపీ వైపు దృష్టి పెట్టారు.
తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయప్రద.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం బీజేపీ తరఫున ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పురందేశ్వరి పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. ఆమె పిలిస్తే.. వచ్చి ప్రచారం చేస్తానని అన్నారు. ఏ బాధ్యత అప్పగించినా పూర్తి చేస్తానని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుకున్నట్టు తెలిపారు. జగన్ పాలన బాగుందా? అన్న ప్రశ్నకు జయప్రద నవ్వుతూ కొద్ది అడుగులు ముందుకు వేశారు. అనంతరం.. ఆమె మాట్లాడుతూ.. బాగుందో లేదో రిజల్ట్ వచ్చాక మీకే తెలుస్తుందిలే! అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.