Begin typing your search above and press return to search.

ఆ రూ.60 వేల కోట్లు.. కేసీఆర్‌ పై జేపీ సంచలన వ్యాఖ్యలు!

అయితే, ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసే ముందు ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు ఆలోచించాల ని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.

By:  Tupaki Desk   |   2 Aug 2023 7:42 AM GMT
ఆ రూ.60 వేల కోట్లు.. కేసీఆర్‌ పై జేపీ సంచలన వ్యాఖ్యలు!
X

రూ.60 వేల కోట్లతో హైదరాబాద్‌ మెట్రోను ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) చుట్టుపక్కల వరకు విస్తరించాల ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌ సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నగరం దాటి మెట్రోను విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. అయితే, ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసే ముందు ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు ఆలోచించాల ని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. అప్పుడే ప్రభుత్వం ఆదాయం పొందడానికి వీలవుతుందన్నారు.

ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రో ఏడాదికి రూ.1,500 కోట్ల మేర భారీ నష్టాల ను చవిచూస్తోందని జేపీ గుర్తు చేశారు. రాబడుల పై ఎలాంటి గ్యారెంటీ లేకుండా మళ్లీ రూ.60 వేల కోట్ల పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జయప్రకాశ్‌ నారాయణ్‌ అభిప్రాయపడ్డారు.

జనసాంద్రత ఎక్కువగా లేని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ మెట్రోను అభివృద్ధి చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని జేపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రయాణికుల వల్లే ప్రధానంగా ఆదాయం వస్తుందని.. ప్రయాణికులు లేకుంటే ఎక్కడి నుంచి ఆదాయం వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రోను అభివృద్ధి చేయడానికి బదులుగా ఆర్టీసీ, ఎంఎంటీసీ, హైదరాబాద్‌ మెట్రోల ను అనుసంధానించాలని జేపీ సూచించారు.

ప్రయాణికులు ఒక గమ్యస్థానం నుంచి మరొక గమ్యస్థానానికి మధ్య ఎక్కువ నడవకుండా సాఫీగా ప్రయాణించగలిగిలే ప్రభుత్వం చర్యలు చేపట్టాల ని జయప్రకాశ్‌ నారాయణ సూచించారు. ఇందుకు ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్ల మధ్య అనుసంధానం పెంచడమే మార్గమన్నారు. విదేశాల్లో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కూడా సౌలభ్యం కోసం మెట్రోల లో ప్రయాణించడానికి ఇష్టపడతారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ముందుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో మెట్రో రైల్‌ను అభివృద్ధి చేయాల ని జేపీ ప్రభుత్వానికి సూచించారు. ఆ తర్వాత రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, జనసాంద్రత అధికంగా ఉన్న చోట, ట్రాఫిక్‌లో ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్న చోట్ల అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకు ఆర్టీసీ, ఎంఎంటీఎస్, హైదరాబాద్‌ మెట్రోల ను అనుసంధానించాలని కోరారు. తగినన్ని పార్కింగ్‌ స్లాట్‌లు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

కాగా కాళేశ్వరం ప్రాజెక్టుపైన జయప్రకాశ్‌ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పై భారీగా ఖర్చు చేసిందన్నారు. అయితే అది తగిన రాబడి ఇవ్వదని.. తెల్ల ఏనుగు మాత్రమేనని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఈ ప్రాజెక్టు కింద సాగుచేస్తున్న పంటల నుంచి రైతులు పొందగలిగే దానికంటే.. నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన విద్యుత్తుకు ఎక్కువ ఖర్చవుతుందని జేపీ తప్పుబట్టారు.

2009లో హైదరాబాద్‌ నగరం లోని కూకట్‌ పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జయప్రకాశ్‌ నారాయణ్‌ 2014లో మల్కాజ్‌ గిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం రాజకీయాల పరంగానూ ఆయన అంత చురుగ్గా లేరు.