Begin typing your search above and press return to search.

'టీడీపీ ఎమ్మెల్యే పేరు చెప్పి కబ్జాలు'.. కలెక్టర్ కు అదే ఎమ్మెల్యే ఫిర్యాదు!

ఇందులో భాగంగా... తన పేరు చెప్పి కొంతమంది భూ కబ్జాలు చేస్తున్నారని

By:  Tupaki Desk   |   29 Oct 2024 7:06 AM GMT
టీడీపీ ఎమ్మెల్యే పేరు చెప్పి కబ్జాలు.. కలెక్టర్  కు అదే ఎమ్మెల్యే ఫిర్యాదు!
X

అనంతపురం జిల్లాలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... తన పేరు చెప్పి కొంతమంది భూ కబ్జాలు చేస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది.

అవును... తన పేరు చెప్పి భూ కబ్జాలు చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఫిర్యాదు చేశారు. ఈ భూ కబ్జాలకు పాల్పడే కార్యక్రమం వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని పేర్కొంటూ ఆయన కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు!!

ఈ సందర్భంగా... గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో చాలా మంది ఇళ్లు నిర్మించుకోకుండా ఖాళీగా పెట్టారని.. ఈ సమయంలో వారిలో అనర్హులను గుర్తించి వారి ఇళ్ల పట్టాలు రద్దు చేయాలని.. నిజంగా అర్హులైన వారికే ఈ ప్రభుత్వ ఇంటి స్థలాలు ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు జయరాం.

కాగా ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం.. టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆలూరు ప్రజల మనోభావాలను అనుగుణంగా వైసీపీని వీడుతున్నట్లు నాడు ప్రకటించారు. తనను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ కోరారని వెల్లడించారు.

అయితే.. తాను మాత్రం ఆలురు నియోజకవర్గాన్ని వీడి వెళ్లాలనుకోవడం లేదని, ఆలూరులోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపి రాజీనామా ఇచ్చారు! అనంతరం టీడీపీలో చేరారు. అయితే టీడీపీ తరుపున ఆలూరు నుంచి కాకుండా.. గుంతకల్లు నుంచి పోటీ చేసి గెలిచారు.