Begin typing your search above and press return to search.

గుడిలో విగ్రహం కోసం సర్పంచ్ పదవికి వేలం... మేటర్ సీరియస్!

ఈ సమయంలో గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయా కుల సంఘాల పెద్దలు నవంబర్ 22ను ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 5:53 AM GMT
గుడిలో విగ్రహం కోసం సర్పంచ్  పదవికి వేలం... మేటర్  సీరియస్!
X

ఒకపక్క తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. అధికార విపక్షాలు ఎవరికి వారు పోటాపొటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పదవులు పొందాలని అభ్యర్థులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు.. ఓటర్ల మెప్పుకోసం తలకిందులుగా తపస్సులు చేస్తున్నారు! ఈ సమయంలో గుడిలో విగ్రహం కోసం ఉన్న పదవిని వేళానికి పెట్టాడు ఒక సర్పంచ్.. ఆ వెలంలో వచ్చిన సొమ్ముతో ఆ గ్రామంలోని గుడిలో విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాడు.

అవును... గ్రామంలో కొత్తగా కట్టిన పోచమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన ఖర్చుల కోసం ఏకంగా తన పదవిని వేలానికి పెట్టారు ఒక సర్పంచ్. విగ్రహ ప్రతిష్ఠకు సుమారు రూ.10 లక్షలు ఖర్చు అవుతాయని లెక్క కట్టి మరీ వేలం పాట నిర్వహించడం మరొకెత్తు. దీంతో ఈ విషయం చర్చనీయాశం అయ్యింది. ఎన్నికల సీజన్, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అధికారులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే... ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా త్వరలో ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలం అంకుషాపురంగ్రామంలో కొత్తగా పోచమ్మ గుడి కట్టారు. అయితే ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. చందాలు వేసుకొని పోచమ్మ గుడి అయితే నిర్మించుకున్నాం కానీ.. మళ్లీ అంతపెద్దమొత్తంలో విగ్రహానికంటే కష్టం అనే మాటలు వినిపించాయి!

ఈ సమయంలో గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయా కుల సంఘాల పెద్దలు నవంబర్ 22ను ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకూ సేకరించిన చందాల ద్వారా వచ్చిన మొత్తం గుడి నిర్మాణానికే సరిపోవడంతో విగ్రహ ప్రతిష్ఠాపన ఖర్చుల కోసం ఏం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ సమయంలో సర్పంచ్ పదవిని వేలం వేయాలని నిర్ణయించారు.

దీంతో... గ్రామంలోని పెద్దలంతా స్థానిక హనుమాన్ టెంపుల్ సమీపంలో కూర్చుని వేలం పాట మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. రూ.3 లక్షలతో మొదలైన వేలంపాట రూ.9 లక్షల 35 వేల దగ్గర ముగిసింది. పాటలో ఆరుగురు పాల్గొనగా.. ఓ కుల సంఘం పెద్ద ఈ పదవి దక్కించుకున్నాడని అంటున్నారు! దీంతో విషయం అధికారులకు చేరింది.. మేటర్ సీరియస్ అయ్యిందని సమాచారం.

ముందుగా ఈ వేలంపాట విషయాలు పంచాయతీ సెక్రటరీకి తెలిసాయని, న్నికల కోడ్ అమల్లో ఉన్నందున విషయాన్ని మండల నోడల్ ఆఫీసర్ (ఎంపీడీవో)కి సమాచారం అందించారని సమాచారం. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో ఎస్ఐ సిబ్బందిని పంపించగా.. అప్పటికే అందరూ ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారని అంటున్నారు. దీంతో... ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో చెబుతున్నారు.