Begin typing your search above and press return to search.

యూఎస్ టు తెలంగాణ... బోగస్ పెట్టుబడులపై క్లారిటీ ఇదిగో!

పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   8 Aug 2024 11:30 AM GMT
యూఎస్ టు తెలంగాణ... బోగస్ పెట్టుబడులపై క్లారిటీ ఇదిగో!
X

పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు పెట్టుబడులు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే... అవన్నీ బోగస్ అనే కామెంట్లూ వినిపిస్తున్న పరిస్థితి. ఈ సమయంలో ఈ వ్యవహారంపై ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ స్పందించారు.

అవును... సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చినట్లు చెబుతున్న పెట్టుబడులన్నీ బోగస్ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్పందించిన జయేష్ రంజన్... ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వీడియో ద్వారా వివరణ ఇచ్చిన ఆయన... తెలంగాణలో పెట్టుబడులన్నీ వాస్తవమే అని అన్నారు.

తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తేవాలనే లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి అమెరికాలో బిజీగా ఉన్నారని చెప్పిన రంజన్... సీఎం అమెరికాలో చేస్తున్న మీటింగుల విశ్వసనీయతపై తెలంగాణ ప్రజలకు ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని తెలిపారు. అన్ని విషయాలూ ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాతనే మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నామని ఆయన వీడియోలో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

మరోపక్క డల్లాస్ లో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు తో చార్లెస్ స్క్వాబ్స్ అనే సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ & డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. ఈ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభిస్తుందని సీఎం హామీ ఇచ్చారు!

ఇదే సమయంలో... ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్ ఆపిల్ పార్క్ కి సీఎం రేవంత్ అండ్ కో వెళ్లనున్నారు ఈ సందర్భంగా ఆపిల్ మ్యానిఫాక్చర్ టీం తో సీఎం రేవంత్ తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ట్రినేట్ కంపెనీ సీఈఓ తో పాటు ఆరం గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులతోనూ రేవంత్ టీం భేటీ కానునందని తెలుస్తోంది.

కాగా... బుధవారం వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో రేవంత్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు సఫలం కానున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివరిశిటీ మొదలైన విషయాలకు సహకారం అందించేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించినట్లు చెబుతున్నారు.