Begin typing your search above and press return to search.

‘ఫ్లై యాష్ ఆనేది నా పుట్టగోస లాంటింది’... జేసీ షాకింగ్ కామెంట్స్!

ఈ సమయంలో ఈ వివాదంపై ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి క్షమాపణలు చెప్పిన జేసీ.. అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 9:31 AM GMT
‘ఫ్లై యాష్ ఆనేది నా పుట్టగోస లాంటింది’... జేసీ షాకింగ్  కామెంట్స్!
X

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి సమస్యలు మాత్రం పోవడం లేదనే చర్చ ఆ పార్టీలోనే బలంగా జరుగుతుందని అంటున్నారు. పైగా.. ఇటీవల తెరపైకి వచ్చిన ఫ్లై యాష్ వివాదం మరింత సంచలనంగా మారింది. ఈ సమయంలో ఈ వివాదంపై ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి క్షమాపణలు చెప్పిన జేసీ.. అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇటీవల ఫ్లై యాష్ వివాదం సీమ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... డబ్బుల కోసం పార్టీలో చేరారంటూ కొంతమంది మాట్లాడుతున్నారని మండిపడుతూ.. అసలు తమ గురించి ఏమనుకుంటున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... తమను 1951లోనే మద్రాసులో చదివించారని తెలిపారు.

తాము అతంత ఖరీదైన కార్లలో ఎప్పుడో తిరిగామని.. తాము లేనివాళ్లం అంటూ కొంతమంది చౌకబారు విమర్శలు చేస్తున్నారని.. తన పొగరు కారణంగా గత ఐదేళ్లు ఆర్థికంగా నష్టపోయామని అన్నారు. అయితే.. ఫ్లై యాష్ డబ్బుల కోసం అంటూ తమపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ కామెంట్లపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.

ఇందులో భాగంగా... "ఫ్లై యాష్ ఆనేది నా పుట్టగోస లాంటింది.. అది మా ప్రిస్టేజ్ మాత్రమే.. మా గురించి మాట్లాడే వాళ్లకే కాదు.. మాకు కూడా చీమూ నెత్తూరూ ఎక్కువగానే ఉంది" అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యనించారు.

ఇక... తాము అందరికీ మొర్రపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని.. డీజీపీ నుంచి ఎస్పీ స్థాయి అధికారులకు కూడా న్యాయం చేయమని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. అయినా ఎవరికీ ఎక్కడా తలవంచాల్సిన అవసరం తమకు లేదని.. చేతకాకపోతె కుటుంబం కోసం క్లీనర్ గా పనిచేసైనా బ్రతుకుతామని అన్నారు.

ఈ సందర్భంగా తనమీద నమోదైన ఎఫ్.ఐ.ఆర్. కాపీలను జేసీ ప్రదర్శించారు. తన లారీలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయని వివరించారు. పోలీసుల పైనా జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అన్నకు ఈ బెంగతోనే ఆరోగ్యం దెబ్బ తిందని వెల్లడించారు. ఇదే సమయంలో.. తాము ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నామని జేసీ స్పష్టం చేశారు!