Begin typing your search above and press return to search.

పవన్ కు సినిమాలే బెటర్... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు!

అవును... టీడీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆసక్తికర కామెంట్లు చేశారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 1:52 PM GMT
పవన్  కు సినిమాలే బెటర్... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు!
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో రెండుచోట్లా ఓడిపోయిన ఆయన 2024 ఎన్నికలకు వచ్చేసరికి తనతో పాటు 21మందిని గెలిపించుకుని 100 స్ట్రైక్ రేట్ తో సక్సెస్ అయ్యారు! ఈ సమయంలో తాజాగా ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన... కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

ఈ సమయంలో పవన్ కల్యాణ్ పరిపాలనా విధానం ఎలా ఉండబోతుందనే విషయంపై తీవ్ర ఆసక్తి నెలకొందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ మాటలకూ, చేతలకూ వ్యత్యాసం ఉంటుందా.. ఉంటే అది ఏస్థాయిలో ఉంటుంది.. తనకు దక్కిన కీలక శాఖల్లో తన మార్కు అడ్మినిస్ట్రేషన్, తన మార్కు నిర్ణయాలూ ఉంటాయా అనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో పవన్ గురించి టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... టీడీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆసక్తికర కామెంట్లు చేశారు. పవన్ కల్యాణ్ గురించి తనకు పెద్దగా తెలియదని, ఆయనను తాను ఎప్పుడూ కలవలేదని అంటూనే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నారని.. మరో నెల తర్వాత ఆయన పరిపాలన, విధానాలపై స్పందించొచ్చని అన్నారు.

అనంతరం... "నాకు తెలిసినంతవరకూ పవన్ కల్యాణ్ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండకపోవచ్చేమో" అని జేసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే... ఆర్థికంగా చూసుకుంటే రాజకీయాలకన్నా సినిమాలే బెటరని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... కుల రాజకీయాలపై స్పందించిన ఆయన... పవన్ కల్యాణ్ కు బేస్ కులమే అని, ఆ కులమే పవన్ ను స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసిందని అన్నారు.

ఈ సమయంలోనే... పవన్ రాజకీయాలు కులంతో ముడిపడి ఉంటాయా.. ఇష్యూలతో ఉంటాయా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలని అన్నారు.