Begin typing your search above and press return to search.

టీడీపీలో నాయకులు లేరు.. జేసీపీఆర్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీ ప్రభుత్వంపైనా, జగన్ సర్కారుపైనా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   16 Aug 2023 8:36 AM GMT
టీడీపీలో నాయకులు లేరు.. జేసీపీఆర్ సంచలన వ్యాఖ్యలు!
X

జగన్ పేరు చెబితే అంతెత్తున లేచే జేసీ బ్రదర్స్ చేసే కామెంట్స్ సంగతి తెలిసిందే. మధ్యమధ్యలో సొంతపార్టీ పైనా, సొంతపార్టీ అధినేతపై కూడా చురకలతో కూడిన కామెంట్స్ చేస్తుంటారు! ఈ సమయంలో వైసీపీపైనా జగన్ సర్కారుపైనా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... వైసీపీ ప్రభుత్వంపైనా, జగన్ సర్కారుపైనా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తాజాగా టీడీపీపైనా కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇందులో భాగంగా... తెలుగుదేశం పార్టీలో నాయకులు లేరని అన్నారు.

టీడీపీలో కార్యకర్తలున్నారని, నాయకులు లేరని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళా పోలీసును ఎస్.ఈ.బి. పోలీస్ స్టేషన్లో అవమానిస్తే మాట్లాడే దిక్కే లేదా తెలుగుదేశం పార్టీకి అని ప్రశ్నించారు. పోని తానేమన్నా అంటే తనను పనికిమాలిన వాడు అని విమర్శిస్తారని షాకింగ్ కామెంట్లు చేశారు.

ఈ సందర్భంగా పోలీసులపైనా, పోలీసు వ్యవస్థపైనా జేసీపీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా ఎంపీ మాదవ్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా పోలీసుకు అవమానం జరిగితే పోలీసు అసోసియేషన్ ఏం చేస్తోందని నిలదీసిన ఆయన... సీఐ చనిపోతే పోలీసు అసోసియేషన్ రాదని, వారికి భయం అని మండిపడ్డారు.

గతంలో తన అన్న చిన్న మాట అంటే పోలీసులు అంతెత్తున లేచారని.. ఈ సందర్భంగా ఓ గోల చేసి ఒక సీఐ ఎంపీ అయ్యాడని వ్యాఖ్యానించారు. దీంతో గోరంట్ల మాధవ్ పై పరోక్షంగా వ్యాఖ్యానించారని అంటున్నారు.

ఈ సందర్భంగా ఇసుక రవాణాపై కూడా జేసీపీఆర్ కీలక వ్యాఖ్యలు చేస్తూ.. జగన్ సర్కార్ ని హెచ్చరించే పనికి పూనుకున్నారు! ఇసుక రవాణాకు అనుమతివ్వాలని, లేకుంటే ఆపాలని జేసీ మండిపడ్డారు. ఈ విషయంపై అధికారులకు లేఖ రాస్తానని చెప్పారు.

ఇదే సమయంలో ఇసుక రవాణాపై అధికారులు, పోలీసుల నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తామే తోలుకుంటామని జేసీ హెచ్చరించారు. ఇసుక రవాణాకు సంబంధించి పోలీసులకు కమిషన్లు అందుతున్నాయని ఈ సందర్భంగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు.