మీ అమ్మాయికి టికెట్ ఉందా.. లేదా.. తేల్చేయండి జేడీ సర్!
రాష్ట్రంలోని పొలిటికల్‌పార్టీలపై కుటుంబ ముద్ర ఉందంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణకు నెటిజన్ల నుంచి అదే స్థాయిలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
By: Tupaki Desk | 24 Dec 2023 2:30 AM GMTరాష్ట్రంలోని పొలిటికల్‌పార్టీలపై కుటుంబ ముద్ర ఉందంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణకు నెటిజన్ల నుంచి అదే స్థాయిలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా జై భారత్ నేషనల్ పార్టీని ప్రకటించిన జేడీ.. ఈ సందర్భంగా కొన్నిసంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కుటుంబ పార్టీల హవా పెరిగిపోయిందని అన్నారు. దీనివల్ల.. యువతకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు.
'కొన్ని కుటుంబాలకే నేటి రాజకీయాలు పరిమితమయ్యాయి. అవే ముఖాలు కనిపిస్తున్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి తిరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే కుటుంబ పాలన కనిపి స్తోంది. కుటుంబ కేంద్రాలుగా ఉండే రాజరికాన్ని మనం వద్దనుకుని ప్రజాస్వామ్యం దిశగా వెళితే మరలా కుటుంబ పాలనలోకి దేశం వెళ్లిపోతోంది. ఆ దిశగానే మన పార్టీ కృషి చేస్తుంది. ఇది కుటుంబ పార్టీ కాదనేందుకు ఇదే ఉదాహరణ'jd అని జేడీ చెప్పుకొచ్చారు.
అయితే.. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ.. తను విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదేసమయంలో ఆయన కుమార్తె ప్రియాంకను అసెంబ్లీ నియోజకవర్గం నుంచిపోటీ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పలు మార్లు అనేక ఇంటర్వ్యూల్లో నూ చెప్పారు. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం, దక్షిణ నియోజకవర్గాల్లోనూ ప్రియాంక దూకుడుగా ఉన్నారు. దీనినే నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
కుటుంబ పార్టీలంటూ.. విమర్శలు చేస్తున్న వీవీ లక్ష్మీనారాయణ.. మరి ఆయన కుమార్తెను రాజకీయా ల్లోకి తీసుకురావడం.. వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగంలోకి దింపడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండాలన్నా.. ఆ ముద్ర పడకుండా ఉండాలన్నా.. కుమార్తె సంగతి ఏంటో వీవీ తేల్చేయాలని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మాజీ జేడీ ఏమంటారో చూడాలి.