జేడీ ముందు మూడు పార్టీలు...ఆప్షన్ దేనికంటే...?
విశాఖ సమస్యల మీద పోరాడుతూ వస్తున్నారు. ఆయన రానున్న ఎన్నికల్లో విశాఖ నుంచి మళ్లీ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
By: Tupaki Desk | 8 Sep 2023 3:59 AM GMTజేడీ లక్ష్మీనారాయణ పవర్ ఫుల్ అధికారి నుంచి పొలిటీషియన్ గా టర్న్ అయిన వారు. సమాజానికి ఏదో చేద్దామని భావించి ఆయన తన సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు. మొదట్లో పార్టీ పెట్టాలని చూసినా 2019 ఎన్నికలు దగ్గరపడంతో జనసేనలో చేరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. గెలుపు సాధించలేదు కానీ అదిరిపోయే లెవెల్ లో ఓట్లు మాత్రం కొల్లగొట్టారు.
ఏకంగా అయనకు రెండు లక్షల ఎనభై వేల పై చిలుకు ఓట్లు దక్కాయి. ఇక ఒక ఏడాది గ్యాప్ ఇచ్చి ఆయన జనసేన నుంచి బయటకు వచ్చారు. సొంతంగానే ఆయన ప్రజా కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడా ఉద్యమించారు. హై కోర్టులో కేసు వేశారు.
విశాఖ సమస్యల మీద పోరాడుతూ వస్తున్నారు. ఆయన రానున్న ఎన్నికల్లో విశాఖ నుంచి మళ్లీ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మధ్యదాకా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని చెప్పిన జేడీ సడెన్ గా ఇపుడు వేరే మాట చెబుతున్నారు. తన చుట్టూ మూడు పార్టీలు తిరుగుతున్నాయని ఆయన అంటున్నారు. తమ పార్టీలో చేరమని అంతా తనను ఆహ్వానిస్తున్నారు అని అంటున్నారు.
ఆ పార్టీలు ఏంటి అన్నది ఆయన చెప్పకపోయినా అందరికీ తెల్సిందే అంటున్నారు. తెలుగుదేశం, జనసేన ఖాయంగా ఉంటాయని అంటున్నారు. ఇక వైసీపీ ఒక పార్టీ గా ఉండవచ్చు అంటున్నారు. జనసేన 2024లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటోంది అంటున్నారు. ఈసారి టీడీపీతో పొత్తు ఉంటుంది కాబట్టి గెలుపు ఖాయమని అంటున్నారు. దాంతో జనసేనకు బెస్ట్ క్యాండిడేట్ గా జేడీ కనిపించవచ్చు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే టీడీపీ కూడా జేడీ తన పార్టీలో చేరమని కోరుతోంది అని అంటున్నారు. జేడీ కోరుకుంటే విశాఖ ఎంపీ సీటు ఇవ్వడానికి టీడీపీకి అభ్యంతరం ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఆయనకు మేధావులు చదువరులతో పాటు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ తో గెలుపు ఖయమని మిగిలిన చోట్ల కూడా టీడీపీని మంచి ఊపు వస్తుంది అని అంటున్నారు.
ఇక వైసీపీ కూడా జేడీని చాలా కాలంగా చేరమని కోరుతోంది అని అంటున్నారు. జగన్ కేసులను విచారించి జేడీ పాపులర్ అయ్యారు. ఇక ఆ కేసులు జైలు జీవితం అన్నీ కలసి జగన్ కూడా ఒక్కసారిగా ఇమేజ్ డబుల్ ట్రిపుల్ చేసుకున్నారు అని అంటారు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని వైసీపీ నేతలు అంటూ జేడీని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అని అంటున్నారు.
మరి ఈ మూడు పార్టీలలో జేడీ ఓటు ఏ పార్టీకి వేస్తారు అన్నదే చూడాలని అంటున్నారు. ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమి గా వస్తాయని అంటున్నారు కాబట్టి ఏ పార్టీలో చేరినా ఒక్కటే అంటున్నారు. కానీ జేడీ వైసెపీలో చేరితే మాత్రం అది సంచలనమే అవుతుంది అని అంటున్నారు. ఇంతకీ జేడీ ముందు మూడు పార్టీలు మూడు ఆప్షన్లు ఉన్నాయి మరి ఆయన ఎవరికి ఓటేస్తారు అన్నదే చూడాల్సి ఉంది.