Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పొడిగింపు... మాజీ జేడీ కీలక వ్యాఖ్య!

ఇదే సమయంలో... తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇదే విషయం ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

By:  Tupaki Desk   |   25 May 2024 10:08 AM GMT
హైదరాబాద్  ఉమ్మడి రాజధాని పొడిగింపు... మాజీ జేడీ కీలక వ్యాఖ్య!
X

ప్రస్తుతం ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని అనే సంగతి తెలిసిందే. అయితే ఆ విషయం చాలా మంది ప్రజానికం ఎప్పుడో మరిచిపోయారని చెప్పినా అతిశయోక్తి కాదు! కారణం... ఓటుకు నోటు వ్యవహారం తెరపైకి వచ్చిన అనంతరం నాటి సీఎం చంద్రబాబు హుటా హుటిన కరకట్టకు వచ్చేయడమే అని అంటుంటారు.

అయితే ఇటీవల కాలంలో ఏపీకి ఇంకా రాజధాని లేనందువల్ల హైదరాబాద్ ని మరికొన్నేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల ప్రస్థావించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరోసారి ఉమ్మడి రాజధాని చర్చ తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో... తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇదే విషయం ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

అవును... 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ అపాయింట్ డే సందర్భంగా ఏపీ - తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ను ప్రకటించింది అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం. ఈ సమయంలో... నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ ను జారీ చేశారు. ఇందులో భాగంగా... 2024 జూన్ 1వ తేదీ వరకు ఉమ్మడి కేపిటల్‌ గా హైదరాబాద్ కొనసాగుతుందనీ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఇంకొద్ది రోజుల్లో ఈ ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోనుంది. దీంతో జూన్ 2 నుంచి తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడున్న ఏపీ ప్రభుత్వానికి చెందిన కొన్ని సంస్థలు ఏపీకి తరలి రావడం మొదలుపెట్టాయని అంటున్నారు. ఈ క్రమంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తెర మీదికి వచ్చారు. తన డిమాండ్ ను తెలియజేశారు!

మరో 10 ఏళ్ల పాటు హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. 2014 జూన్ 2వ తేదీన చోటు చేసుకున్న ఏపీ విభజన తర్వాత ఈ 10 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసిన వీవీ లక్ష్మీనారాయణ... అందుకే మరో 10 ఏళ్ల హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.