Begin typing your search above and press return to search.

మోడీ క్యాబినెట్ లో జేడీయూ మంత్రులు వీరేనా?

ఇక ఈ లోక్ సభ ఎన్నికల్లో జేడీయూ 12 ఎంపీస్థానాలు గెలుపొందింది. ఫలితంగా... ఎన్డీయే కూటమిలో కీలక భూమిక పోషిస్తుంది.

By:  Tupaki Desk   |   8 Jun 2024 2:44 PM GMT
మోడీ క్యాబినెట్ లో జేడీయూ మంత్రులు వీరేనా?
X

2019కి 2024కి ఎంత తేడా? అనే ప్రశ్న తెరపైకి వస్తుండటం.. అబ్బో.. ఎంతో తేడా అనే సమాధానం తదణుగుణంగా వినిపిస్తుండటం గత కొన్ని రోజులుగా మొదలైంది! కేంద్రంలో బీజేపీకి ఈసారి సింగిల్ గా మెజారిటీ రాకపోవడంతో బలమైన రీజనల్ పార్టీలు, ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతున్న పార్టీలు తమ తమ కోరికల చిట్టాలను విప్పుతున్నాయి.

అవును... ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోకపోవదంతో ఎన్డీయే కూటమిలోని బలమైన రీజనల్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషించబోతున్నాయి! ఈ క్రమంలో ఈసారి కేంద్రంలో ఏపీ నుంచి టీడీపీ, బీహార్ నుంచి జేడీయూ ది కీరోల్ అంటున్న వేళ... ఆ పార్టీలకు సంబంధించిన కేంద్ర మంత్రి పదవుల చర్చ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... కొత్తగా కొలువుదీరనున్న మోడీ ప్రభుత్వంలో ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామ్య పక్షమైన జేడీయూకు రెండు క్యాబినెట్ బెర్తులు దక్కనున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోని ఇద్దరు సీనియర్ నాయకులకు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వనున్నారని అంటున్నారు. ఈ మేరకు కథనాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో... తమ పార్టీ తరుపున ఎవరికి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇవ్వాలనే విషయంపై జేడీయూ ఇప్పటికే ఒక ప్రతిపాదనను బీజేపీ పెద్దల ముందు ఉంచినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఆ పార్టీ సీనియర్ నేతలైన లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ ల పేర్లను కేంద్రమంత్రి పదవుల కోసం జేడీయూ ప్రతిపాదించినట్లు సమాచారం!

కాగా... వీరిలో లలన్ సింగ్.. బీహార్ లోని ముంగేర్ నియోజకవర్గం నుంచి లోక్ సభ కు ఎన్నికవ్వగా... రామ్ నాథ్ ఠాకూర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన కర్పూరీ ఠాకూర్ కుమారుడే ఈ రామ్ నాథ్ ఠాకూర్. ఇక ఈ లోక్ సభ ఎన్నికల్లో జేడీయూ 12 ఎంపీస్థానాలు గెలుపొందింది. ఫలితంగా... ఎన్డీయే కూటమిలో కీలక భూమిక పోషిస్తుంది.