Begin typing your search above and press return to search.

తమిళనాడు అమ్మాయిని ఆంధ్రా అల్లుడు అంత మాట అన్నాడా?

అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఇప్పుడో విచిత్రమైన సన్నివేశం ఆవిష్క్రతమైంది.

By:  Tupaki Desk   |   27 July 2024 6:47 AM GMT
తమిళనాడు అమ్మాయిని ఆంధ్రా అల్లుడు అంత మాట అన్నాడా?
X

అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఇప్పుడో విచిత్రమైన సన్నివేశం ఆవిష్క్రతమైంది. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో తమిళ అమ్మాయి.. ఆంధ్రా అల్లుడు హాట్ టాపిక్ గా మారారు. ఎన్నికల ఎజెండాను ప్రభావితం చేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన కమలా హారిస్ గురించి తెలిసిందే. తమిళ మూలాలు ఉన్న భారతీయ కుటుంబానికి చెందిన వారు. ఇప్పుడామె అధ్యక్ష పదవి బరిలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే డెమొక్రాట్ల అభ్యర్థిగా ఆమె అధ్యక్ష రేసులోకి వచ్చేయనున్నారు.

మరోవైపు రిపబ్లికన్ల తరఫు.. ఉపాధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల బరిలో ఉన్న జేడీ వాన్స్ గురించి తెలిసిందే. ఆంధ్రా మూలాలు ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని అతగాడు పెళ్లి చేసుకున్నారు. దీంతో.. తమిళ అమ్మాయి.. ఆంధ్రా అల్లుడు ఈసారి అమెరికా అధ్యక్ష.. ఉపాధ్యక్ష ఎన్నికల రేసులో ఉండటం ఆసక్తికరంగా మారింది. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ మాదిరే జేడీ వాన్స్ కు నోటి దురుసు ఎక్కువన్నది చర్చగా మారింది. దాదాపు మూడేళ్ల క్రితం కమలా హారిస్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు తెర మీదకు వచ్చింది.

దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది? ఏ సందర్భంలో జేడీ వాన్స్ నోరు పారేసుకున్నారు? అన్న విషయంలోకి వెళితే.. 2021లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కమలా హారిస్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. పిల్లలు లేని స్త్రీల దైనందిక జీవితం దయనీయంగా ఉంది. వారు దేశాన్ని కూడా అలాగే దయనీయంగా మార్చాలని అనుకుంటున్నారు. ఇది నిజం. కమలా హారిస్ ను చూడండి. డెమొక్రాట్ల భవిష్యత్తును పిల్లలు లేని వ్యక్తులు నియంత్రిస్తున్నారు. దేశానికి సంబంధించి ప్రత్యక్ష వాటా లేని ఇలాంటి వ్యక్తుల చేతిలో అధికారాన్ని పెట్టటంలో అర్థం లేదంటూ’’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

వాన్స్ చేసిన వ్యాఖ్యల్ని సింఫుల్ గా.. మనకు మరింత ఈజీగా అర్థం కావాలంటే.. పిల్లల్నేని గొడ్రాలు చేతికి అధికార పగ్గాలు ఇవ్వటం ఏమిటి? అన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కీలక పదవుల్లో ఉండే వారికి పిల్లలు ఉండటం.. ఉండకపోవటం కూడా ఒక అంశమా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది. కానీ.. అలాంటి మాటలతో నోరు పారేసుకున్న జేడీ వాన్స్ మాటలు ఎన్నికల బరిలోకి అతగాడు రావటంతో ఆ మాటలన్ని బయటకు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో జేడీ వాన్స్ కు రిపబ్లికన్ పార్టీ నుంచి కీలక సూచన వచ్చినట్లుగా చెబుతున్నారు.

గతంలో మాట్లాడిన మాటల సంగతి ఎలా ఉన్నా.. ఇకపై మాత్రం కమలా హారిస్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నోరు జారొద్దని.. ఆమెపై లింగ వివక్ష.. జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించిన రిపబ్లికన్లు.. జేడీవాన్స్ కు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. కమలా గురించి ఏం మాట్లాడాలన్నా.. పాలనలో ఆమె వైఫల్యాలు.. పాలసీల పరంగా ఆమె తప్పుల్ని మాత్రమే ఎత్తి చూపాలే తప్పించి.. వివాదాస్పద అంశాల జోలికి మాత్రం వెళ్లొద్దని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో సౌతిండియా మూలాలు ఉన్న వ్యక్తుల సెంట్రిక్ గా సాగటం ఆసక్తికరమని చెప్పకతప్పదు.