Begin typing your search above and press return to search.

పెళ్లి అవుతోంది.. నా ప్రొఫైల్ డిలీట్ చేయండన్న అదానీ చిన్నకొడుకు

తాజాగా అలాంటి విషయాల్నే వెల్లడించారు భారతీయ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   5 Feb 2025 5:30 AM GMT
పెళ్లి అవుతోంది.. నా ప్రొఫైల్ డిలీట్ చేయండన్న అదానీ చిన్నకొడుకు
X

ప్రముఖల ప్రైవేటు విషయాలు బోలెడంత ఆసక్తిగా అనిపిస్తాయి. సాధారణంగా ఇలాంటివి కూడా జరుగుతాయా? అన్నట్లుగా వారి సంగతులు ఉంటాయి. తాజాగా అలాంటి విషయాల్నే వెల్లడించారు భారతీయ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ చెప్పుకొచ్చారు. అతడి పెళ్లి గుజరాత్ కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తెతో ఈ నెల ఏడో తేదీన జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇతగాడి విషయానికి వస్తే వర్సిటీ ఆఫ్ సెన్సిల్వేనియా నుంచి ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ లో పట్టా పొందారు. 2019లో అదానీ గ్రూప్ లో జాయిన్ అయిన ఇతను.. స్ట్రాటజిక్ మేనేజ్ మెంట్.. క్యాపిటల్ మార్కెట్స్ విభాగాల బాధ్యతల్ని చూడటంతో పాటు అదానీ ఎయిర్ పోర్ట్స్.. అదానీ డిజిటల్ ల్యాబ్స్ ను లీడ్ చేస్తున్నారు. తన పెళ్లి నేపథ్యంలో షార్క్ ట్యాంక్ ఇండియా షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి.. షాదీ.కామ్ సీపీవో అనుపమ్ మిత్తల్ తో మాట్లాడారు.

తాను పెళ్లి చేసుకోనున్న దివాతో తన పరిచయం ఎలా జరిగిందన్న విషయంతో పాటు.. ఆయన్ను ఒక స్పెషల్ రిక్వెస్టు అడిగిన వైనం ఆసక్తికరంగా మారింది. తమ కుటుంబానికి చెందిన ఒక స్నేహితుడి ద్వారా తనకు దివా పరిచయమైందని.. తాను 8 గ్రేడ్ చదువుతున్నప్పుడు తన మీద ఫ్రాంక్ చేసే క్రమంలో ఒక ఫ్రెండ్ తన ప్రొఫైల్ ను షాదీ.కామ్ లో క్రియేట్ చేశారని చెప్పారు.

అయితే.. ఈ ప్రొఫైల్ కు ఎవరి ఫోన్ నెంబరు.. ఈమొయిల్ ఐడీ ఇచ్చారో తనకు తెలీదని.. దానిని డిలీట్ చేసేందుకు తాను ఎంతో ప్రయత్నించినప్పటికి డిలీట్ కాలేదన్నారు. తనకు ఇప్పుడు పెళ్లి జరుగుతుందని.. ఇప్పటికైనా తన ప్రొఫైల్ డిలీట్ చేయాలంటూ సరదాగా మాట్లాడారు. ఈ తీరు అందరిని ఆకట్టుకొంటోంది. మిగిలిన సంపన్నులకు భిన్నంగా నిరాడంబరంగా తన పెళ్లిని చేసుకుంటున్నారు. కాకుంటే.. సంప్రదాయ పద్దతిని ఫాలో అవుతున్నారు.