Begin typing your search above and press return to search.

యూదులు ఇతరుల రక్తాన్ని తీసుకోరా... "తోరా"లో ఏముంది?

ఈ దాడుల్లో ఇప్పటివరకూ ఇప్పటి వరకు 3,200 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 11వేల మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 12:30 AM GMT
యూదులు ఇతరుల రక్తాన్ని తీసుకోరా... తోరాలో ఏముంది?
X

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరువర్గాలకు చెందిన వందలాదిమంది మృతి చెందగా, లెక్కలేనంతమంది తీవ్ర గాయాలపాలవుతున్న సంగతి తెలిసిందే. హమాస్ ఉగ్రవాదుల దాడుల్లో ఇజ్రాయేల్ ప్రజలు సుమారు 1300 మంది చనిపోయారని చెబుతున్నారు. అదేవిధంగా సుమారు 200 మంది హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్నారని అంటున్నారు. మరోపక్క ఇజ్రాయేల్ దాటికి గాజా గజ గజ లాడుతుంది.

గాజాపై వితౌట్ గ్యాప్ అన్నట్లుగా ఇజ్రాయేల్ వైమానిక దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో ఇప్పటివరకూ ఇప్పటి వరకు 3,200 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 11వేల మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు గాజాపై దాడులు ఆపేస్తే బందీలందరినీ విడిచిపెట్టేస్తామని హమాస్‌ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పినట్లు "ఎన్‌బీసీ న్యూస్‌" కథనం వెల్లడించింది.

ఆ సంగతి అలా ఉంటే... హమాస్ దాడుల్లో విపరీతంగా గాయపడిన ఇజ్రాయేల్ ప్రజలకు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే... యూదులు తమ వైద్యచికిత్సలో ఎవరి నుంచి కూడా రక్తాన్ని తీసుకోరనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇందులో ఎంత నిజం ఉంది.. అదే నిజమైతే దీని వెనుక ఉన్న కథ ఏమిటి.. రక్తం ఎక్కించకపోతే క్షతగాత్రుల పరిస్థితి ఏమిటి అనే చర్చ మొదలైంది.

వివరాళ్లోకివెళ్తే... యూదులు తమ పవిత్ర గ్రంథం "తోరా"లో ఉన్న నియమ నిబంధనలను తప్పక పాటిస్తారు. ఇవి బైబిల్ లోని పాత నిబంధన గ్రంథంలోనివి కావడంతో... మారుతున్న కాలంతో పాటు ఈ నిబంధనలలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో ఇతరుల రక్తాన్ని ఎక్కించుకోవడం ఒకటి! ఎందుకంటే... పూర్వం యూదులు ఈ పనికి అంగీకరించేవారు కాదు!

అవును... పాత తరం యూదులు చికిత్స సమయంలో ఎవరి రక్తాన్ని తీసుకునేందుకు ఇష్టపడరు. వారు ఎంత అనారోగ్యంతో ఉన్నాకూడా మరొకరి రక్తాన్ని తమ శరీరంలోకి ఎక్కించడానికి అంగీకరించరు. కారణం... యూదులు.. రక్తాన్ని ప్రాణంతో సమానంగా భావిస్తారు. వేరొకరి రక్తాన్ని తీసుకోవడమంటే వారి ప్రాణాన్ని తీయడమేనని అనుకుంటారు. అయితే... నేటితరం యూదులు మాత్రం ఇతరుల రక్తం ఎక్కించుకుంటున్నారు!

"తోరా"లో ఏముంది?

"తోరా" యూదుల పవిత్ర గ్రంథం. తోరా అనే పదం తోహ్-రా నుంచి రూపొందింది. అంటే... నేర్చుకోవడం అని అర్ధం! తోహ్-రా అనే పదం బైబిల్‌ లోని మొదటి ఐదు పుస్తకాలను సూచిస్తుంది. వీటిని పంచగ్రంథం అంటారు. ఇవి జెనెసిస్ (ఆదికాండము), ఎక్సోడస్ (నిర్గమకాండము), లెవిటికస్ (లేవీకాండము), నంబర్స్ (సంఖ్యాకాండము), డ్యూటెరోనమీ (ద్వితియోపదేశ కాండము).

"తోరా"ను మోషే రాశాడని చెబుతారు. అందుకే దీనిని "మోషే ధర్మశాస్త్ర గ్రంథం" అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులు ఈ పుస్తకం ద్వారానే తమ దేవుణ్ణి స్మరించుకుంటారు. సృష్టి ప్రారంభం నుంచి మోషే మరణం వరకు దేవుడు ప్రజలతో ఎలా వ్యవహరించాడో ఈ పవిత్ర గ్రంథంలో పేర్కొన్నారని వారు చెబుతారు.