Begin typing your search above and press return to search.

యూఎస్ లో గన్ కల్చర్... బైడెన్ తెచ్చిన కొత్త చట్టం ఏమిటంటే..?

ఇక వీకెండ్ వచ్చిందంటే.. ఏ మూల తుపాకీ చప్పుళ్లు వినిపిస్తాయో అనే టెన్షన్ నిత్యం ఉంటుందని అంటుంటారు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 11:30 AM GMT
యూఎస్  లో గన్  కల్చర్... బైడెన్  తెచ్చిన కొత్త చట్టం ఏమిటంటే..?
X

అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉందనేది తెలిసిన విషయమే. అమెరికాలో నిత్యం ఏదో ఓ మూల కాల్పుల శబ్ధం వినిపిస్తూనే ఉంటుంది. ఫలితంగా అమాయక పౌరులు మృతిచెందడమో.. తీవ్రంగా గాయపడటమో జరుగుతుంటుంది. ఇక వీకెండ్ వచ్చిందంటే.. ఏ మూల తుపాకీ చప్పుళ్లు వినిపిస్తాయో అనే టెన్షన్ నిత్యం ఉంటుందని అంటుంటారు.

రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతున్న ఈ గన్ కల్చర్ కారణంగా అమాయకపు పౌరులతో పాటు చిన్నారులు సైతం బలైపోతున్నారు. ఇటీవల చిన్నారులు సైతం ఈ కల్చర్ కి అలవాటుపడుతున్న కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ కల్చర్ కి అంతం పలకాలనే ఉద్దేశ్యంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త చట్టంపై సంతకాలు చేశారు.

అవును... అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరిగిపోతున్న వేళ అధ్యక్షుడు జో బైడెన్ కొత్త చట్టంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ లో స్పందించిన ఆయన... అమెరికాలో వ్యాధులు, ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్న చిన్నారుల కంటే.. తుపాకీల కారణంగా చోటుచేసుకుంటున్న మృతుల సంఖ్య ఎక్కువని అన్నారు.

ఇదే సమయంలో... ఇది అత్యంత బాధాకరమైనది అని చెప్పిన యూఎస్ ప్రెసిడెంట్.. ఈ హింసను అంతం చేయడానికి తాను, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కృషి చేస్తున్నట్లు తెలిపారు.. ప్రజలంతా తమతో చేతులు కలపాలని కోరారు. ఈ సందర్భంగా... ఈ తుపాకీ హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా... ఎన్నికల కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు స్టాప్ గ్యాప్ బిల్లుపైనా బైడెన్ సంతకం చేశారు. ఈ బిల్లు ఆధారంగా డిసెంబరు 20 వరకూ ప్రభుత్వానికి నిధులు అందుతాయని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న తరుణంలో ఈ బిల్లుపై సంతకాలు చేయడం గమనార్హం.

కాగా... అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. స్కూల్స్, యూనివర్శిటీస్ లలో ఇటీవల కాల్పుల సంఖ్య బాగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నిర్వహించిన పరిశోధన ప్రకారం... 2019 సుమారు 3,390 మంది పిల్లలు తుపాకీ కారణంగా మృతి చెందారు. వీరి సంఖ్య 2020 నాటికి 4,368 కి చేరగా.. 2021 నాటికి 4,752 గ ఉంది.