Begin typing your search above and press return to search.

అమెరికాలో గంజాయి బ్యాచ్‌ లకు గుడ్ న్యూస్.. ప్రెసిడెంట్ పోస్ట్ వైరల్!

ఇందులో భాగంగా.. "ఫెడరల్ చట్టం ప్రకారం షెడ్యూల్ 1 నుండి షెడ్యూల్ 3 కి గంజాయిని తిరిగి వర్గీకరించడానికి ప్రధాన చర్యలు తీసుకుంటుంది" అని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   17 May 2024 6:32 AM GMT
అమెరికాలో గంజాయి బ్యాచ్‌  లకు గుడ్  న్యూస్.. ప్రెసిడెంట్  పోస్ట్  వైరల్!
X

భారత్ లో గంజాయి అనేది అతిపెద్ద సమస్యల్లో ఒకటని.. యువత తప్పుడు మార్గంలో ప్రయాణించడానికి ఇదొక కారణం అని.. ఎన్నో అసాంఘిక కార్యక్రమాలకు ఇదొక మార్గమని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అనూహ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో గంజాయి బ్యాచ్ లకు గుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... అమెరికాలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో... ఆ దేశంలో గంజాయిని నెమ్మదిగా చట్టబద్ధం చేసే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడినట్లయ్యిందని అంటున్నారు. ఈ క్రమంలోనే గంజాయిని షెడ్యూల్‌-1 డ్ర గ్‌ (అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యం) నుంచి షెడ్యూల్‌-3 డ్రగ్‌ (తక్కువ ప్రమాదకరమైన మాదక ద్రవ్యం) కేటగిరీకి మార్చారు!

వాస్తవానికి అమెరికాలో మాదకద్రవ్యాల నిషేధిత చట్టం రూపకల్పన 1937లో జరిగింది. ఆ తర్వాత మైనర్‌ లు కూడా అధికంగా మాదకద్రవ్యాల బారిన పడుతున్నారనే కారణాలతో 1970లో కొత్త చట్టం తెచ్చారు. దీని ప్రకారం గంజాయిని ఇంతకాలం షెడ్యూల్‌-1 డ్రగ్‌ కింద ఉంచారు. ఇందులో గంజాయితో పాటు.. హెరాయిన్‌, ఎల్ఎస్డీ, ఎక్సాట్సీ వంటివి కూడా ఉన్నాయి.

అంటే... అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ అన్నీ షెడ్యూల్ - 1 లో ఉంచారు. ఈ చట్టప్రకారం పైన పేర్కొన్న వీటిని సేవించినా, కనీసం కలిగి ఉన్నట్లు రుజువైన కఠిన శిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్‌ లో ఉన్న గంజాయిని.. షెడ్యూల్‌-3 డ్రగ్స్‌ లోకి మార్చేందుకు ప్రతిపాదన చేశారు. దీంతో... ఈ విషయం గంజాయి బ్యాచ్ లకు గుడ్ న్యూస్ గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

గంజాయిని ప్రమాదకరమైన డ్రగ్స్‌ జాబితాను తొలగించే ప్రయత్నాలు బైడెన్‌ హయాంలో 2022లోనే మొదలయ్యాయి. అలాగని అమెరికాలో గంజాయిని సేవించడం, కలిగి ఉండడం చట్టబద్ధం అని మాత్రం కాదు కానీ... ఇంతకు ముందు స్థాయిలో మాత్రం అరెస్టులు, శిక్షలు ఉండకపోవచ్చు!

ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇన్ స్టాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో భాగంగా.. "ఫెడరల్ చట్టం ప్రకారం షెడ్యూల్ 1 నుండి షెడ్యూల్ 3 కి గంజాయిని తిరిగి వర్గీకరించడానికి ప్రధాన చర్యలు తీసుకుంటుంది" అని పేర్కొన్నారు.

కాగా... ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ సర్వే ప్రకారం.. అమెరికాలో సుమారు 88 శాతం పౌరులు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారని.. కేవలం 11 శాతం మంది మాత్రమే అస్సలు అలాంటి ఆలోచనే వద్దని కోరారని చెబుతున్నారు. దీంతో... బైడెన్‌ తీసుకున్న ఈ నిర్ణయం.. ఈ ఏడాది నవంబర్‌ లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను తీవ్ర ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.