Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్ దొరక్కే ఆ హత్యలు... దుండగుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు!

సిడ్నీ వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ మాల్ లో ఒక వ్యక్తి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 April 2024 3:30 PM GMT
గర్ల్ ఫ్రెండ్ దొరక్కే ఆ హత్యలు... దుండగుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు!
X

సిడ్నీ వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ మాల్ లో ఒక వ్యక్తి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అతడిని జోయెల్ కౌచీగా గుర్తించిన పోలీసులు.. మహిళలే లక్ష్యంగా అతడు దాడికి పాల్పడ్డాడని వెల్లడించారు. దీనికి సంబంధించిన మృతుల వివరాలు వెల్లడించారు. ఈ సమయంలో జోయెల్ కౌచీ తండ్రి ఆండ్రూ కౌచీ మైకులముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి సంబంధించిన సంచలన విషయలు వెల్లడించారు.

అవును... ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల షాపింగ్ మాల్ లో జోయెల్ కౌచీ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అతడు మొత్తం ఆరుగురిని పొడిచి చంపగా.. అందులో ఐదుగురు మహిళలే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో... అతడి దాడిలో గాయపడిన 12 మందిలోనూ మహిళలే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇలా ప్రధానంగా మహిళలే లక్ష్యంగా అతడు దాడులకు పాల్పడ్డాడని వెల్లడించారు.

ఈ సందర్భంగా... బాధితులను చైనాకు చెందిన విద్యార్థిని యియువాన్‌ చెంగ్‌ ను గుర్తించగా.. మిగిలిన వాళ్లలో ఒక డిజైనర్, ఒక పారిశ్రామికవేత్త కుమార్తె, ఒక స్వచ్ఛంద సేవకురాలు, ఆమె తల్లితోపాటు 9 నెలల పసిబిడ్డ, పాకిస్థాన్‌ కు చెందిన 30 ఏళ్ల సెక్యూరిటీ గార్డు ఫరాజ్‌ తాహిర్‌ గా గుర్తించారని తెలుస్తుంది. వీరిలో చైనా విద్యార్థిని తన కాబోయే భర్త తో ఫోన్‌ లో మాట్లాడుతుండగా దుండగుడు దాడి చేయడంతో.. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు!

ఈ క్రమంలో తాజాగా ఈ విషయాలపై స్పందించిన జోయెల్ కౌచీ తండ్రి ఆండ్రూ కౌచీ సంచలన విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ప్రపంచానికి అతడొక దుర్మార్గుడే కానీ.. తనకు తెలిసి మాత్రం ఒక మానసిక రోగి అని అన్నారు. అతడు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలనుకున్నాడు కానీ.. అందుకు తగ్గ నైపుణ్యాలు లేకపోవడంతో నిరాశకు గురయ్యాడని వెల్లడించారు. అందువల్లే ఇలా దాడికి పాల్పడ్డాడని తెలిపారు.

ఇదే సమయంలో... అతడు చేసినది అత్యంత భయంకరమైన విషయం అని.. చనిపోయినవారిని తాను తీసుకురాలేనని.. ఈ సందర్భంగా అంతా తనను క్షమించాలని ఆండ్రూ కౌచీ కోరారు! ఇక తమతో కూడా అప్పుడప్పుడూ మాత్రమే మెసేజ్‌ ల ద్వారా టచ్‌ లో ఉండేవాడని అన్నారు.