దాడి చేయలేదు.. టీడీపీ కుట్ర: పోలీసులకు జోగి ?
ఈ సమయంలో సుమారు 25కు పైగా ప్రశ్నలు.. జోగికి అధికారులు సంధించినట్టు తెలిసింది.
By: Tupaki Desk | 11 April 2025 10:06 AMటీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై 2021లో తన మందీ మార్బలంతో దాడికి య త్నించారంటూ.. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌పై సీఐడీ పోలీసులు కేసు నమో దుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం విచారణకు పిలిచారు. దీనికి సంబంధించి నాలుగు రోజుల ముందుగానే ఆయనకు నోటీసులు అందించారు. తాజాగా శుక్రవారం విజయవాడ శివారులోని తాడిగడపలో ఉన్న సీఐడీ కార్యాలయానికి జోగి వచ్చారు.
ఈ సమయంలో సుమారు 25కు పైగా ప్రశ్నలు.. జోగికి అధికారులు సంధించినట్టు తెలిసింది. దాడికి కారణాలేంటి?.. కుట్ర పూరితంగా చంద్రబాబుపై దాడికి యత్నించారా? అని కీలక ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. అంతేకాదు.. వైసీపీ కీలక నాయకుల హస్తం.. అప్పటి ప్రభుత్వ పాత్రను కూడా.. అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే.. వారు అడిగిన ప్రశ్నలకు జోగి చాలా వ్యూహాత్మకంగా సమాధానం చెప్పారని.. పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
చంద్రబాబు ఇంటిపై దాడి చేయలేదని.. ఆయనతో చర్చించేందుకు మాత్రమే తాము వెళ్లామనిజోగి పోలీ సులకు వివరించినట్టు తెలిసింది. అంతేకాదు.. టీడీపీ నాయకులే అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని.. వారిని నిలువరించే ప్రయత్నం చేయాలని తాను పార్టీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా.. చంద్రబాబు ను విన్నవించేందుకు మాత్రమే అప్పట్లో ఆయన ఇంటికి వెళ్లానని.. కానీ, చంద్రబాబు అపార్థం చేసుకున్నారని చంద్రబాబును తాను ఎప్పుడూ పరుషంగా కూడా వ్యాఖ్యానించలేదని చెప్పినట్టు సమాచారం.
ఇక, టీడీపీనే వైసీపీపై కుట్ర పన్నిందని.. అప్పటి తమ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా ప్రజల్లో విప్లవం సృష్టించి.. జగన్‌ను అధికారం నుంచి దింపేసేందుకు కుట్ర చేశారని కూడా.. జోగి చెప్పినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీని వెనుక కారణాలు తెలుసుకునేందుకు తన వారితో వెళ్లిన మాట వాస్తవమేనని.. అయితే.. అక్కడ ఏమీ జరగకుండానే.. చంద్రబాబు భద్రతా సిబ్బంది తమపై దాడికి పాల్పడ్డారని చెప్పినట్టు సమాచారం. అయితే.. మరోసారి పిలిచినప్పుడు రావాలని జోగికి అధికారులు తేల్చి చెప్పారు.