Begin typing your search above and press return to search.

అన్న పార్టీ మారుతుండహో...వైసీపీకి బిగ్ షాకేనా ?

వైసీపీ అధినేత జగన్ కి ఎంతో సన్నిహితుడుగా పేరు గడించిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ గురించే ఈ వార్త.

By:  Tupaki Desk   |   21 Oct 2024 4:25 AM GMT
అన్న పార్టీ మారుతుండహో...వైసీపీకి బిగ్ షాకేనా ?
X

ఎవరా అన్న ఏమా కధ అంటే చాలానే ఉంది ని క్రిష్ణా జిల్లా అంటోంది. వైసీపీ అధినేత జగన్ కి ఎంతో సన్నిహితుడుగా పేరు గడించిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ గురించే ఈ వార్త. ఒక విధంగా ఇది పుకారుగా షికారు చేస్తోంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది.

వైసీపీకి అంకితం అయి ఎంతో విధేయత చూపించే జోగి రమేష్ ఇపుడు పార్టీ మారబోతున్నారు అన్నదే ఆ పుకారు లాంటి ప్రచారం. నిజంగా ఇది జరుగుతుందా అంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎపుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి అని అంటున్నారు. ఇక వైసీపీ ఘోర పరాజయం తరువాత జోగి రమేష్ మీద టీడీపీ కూటమి టార్గెట్ చేసింది.

ఆయన మీద కేసులను కూడా పెడుతున్నారు. చంద్రబాబు ఉండవల్లి నివాసం మీద జోగి రమేష్ దాడి చేశారు అన్న దాని మీద జోగి రమేష్ ని అరెస్ట్ కూడా చేస్తారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో చిక్కుకుని జైలు పాలు అయ్యారు. ఆయన కొన్నాళ్ళ పాటు జైలు జీవితం గడిపి ఇటీవల బయటకు వచ్చారు.

మరో వైపు చూస్తే జోగి రమేష్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని తేలడంతో ఆయన పార్టీ మారుతారు అని అంటున్నారు. అయితే ఆయన ప్రత్యర్ధులు అంతా టీడీపీలో ఉండడంతో జోగి రమేష్ జనసేనలో చేరుతారు అని అంటున్నారు. ఆ విధంగా మిత్రపక్షంగా కూటమిలో ఉన్న జనసేనలో చేరితే రాజకీయంగా ఉపశమనం కలుగుతుందని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు

ఈ విషయమే ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్న పార్టీ మారుతున్నాడహో అని కూడా కాప్షన్లు పెట్టి వైరల్ చేస్తున్నారు. జోగి రమేష్ అనుచరులే ఈ ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పార్టీలోకే జోగి రమేష్ మారుతున్నారు అని చెప్పడం ద్వారా ఇండైరెక్ట్ గా జనసేన అని అంటున్నారుట.

ఇక జోగి కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ కి ముఖ్య అనుచరురుడిగా ఉంటూ వచ్చారు. ఆయన మరణంతో జగన్ వైపు వచ్చారు. వైసీపీలో జగన్ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. 2022లో జరిగిన విస్తరణలో ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా చేశారు. జోగి కూడా జగన్ మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. ఆయన సైతం తన వంతుగా పార్టీ పట్ల వీర విధేయత చాటుకునేవారు.

కానీ రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఉండడడంతోనే జోగి రమేష్ పార్టీ మారాలని చూస్తున్నారా అన్న ప్రచారం అయితే సాగుతోంది. గత కొంతకాలంగా జోగి రమేష్ పెద్దగా బయట సౌండ్ చేయడం లేదు, ఆయన వాయిస్ అయితే దాదాపుగా తగ్గిపోయింది అని అంటున్నారు. మొత్తం మీద బీసీలల్లో కీలక నేత, జగన్ కి అతి ముఖ్యమైన నాయకుడిగా ఉన్న జోగి రమేష్ కనుక పార్టీ మారితే క్రిష్ణా జిల్లాలో వైసీపీకి మరింత ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. చూడాలి మరి ఈ పుకార్లు ఎంత మేరకు నిజం అవుతాయో.