జోగి రమేష్ పార్టీ జంప్?
అవతలివైపు నుంచి క్లారిటీ రావడమే ఆలస్యం, ఫ్యాన్ కింద నుంచి లేచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో మరో కీలక నేత జోగి రమేష్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 16 Dec 2024 4:55 AM GMTఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నేతలు పలువురు జగన్ కు బై బై చెబుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రాజ్యసభ సభ్యులు ముగ్గురూ కలిసి ఒకేసారి పార్టీకి షాక్ ఇవ్వగా.. అనంతరం పలువురు కీలక నేతలూ షాకిచ్చారు. ఇక చిన్న చితకా నేతల సంగతి చెప్పేపనే లేదని అంటున్నారు.
మాజీ మంత్రులు ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా జగన్ కు బై చెప్పారు. ఇలా పార్టీలో ఉన్న కీలక నేతలు, సీనియర్లు జగన్ కు బై బై చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మీడియా ప్రశ్నించగా.. "యా సీనియర్లు పార్టీని వీడుతున్నారమ్మా.. ఏమతాది.. ఆ ప్లేస్ లోకి ఇంకొకళ్లు వస్తారు!" అంటూ తనదైన శైలిలో స్పందించారు.
ఇదే సమయంలో మరికొంతమంది మాజీ మంత్రులు, కీలక నేతలు కూడా ఈ జాబితాలో చేరబోతున్నారని.. అవతలివైపు నుంచి క్లారిటీ రావడమే ఆలస్యం, ఫ్యాన్ కింద నుంచి లేచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో మరో కీలక నేత జోగి రమేష్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.
అవును... వైసీపీలో ఇటీవల మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్ లు ఒకేరోజు వైసీపీకి షాకిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ జాబితాలో మరెంత మంది ఉన్నారో అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేష్ త్వరలో వైసీపీని వీడనున్నరనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ తరహా చర్చ గతంలో కూడా వచ్చినప్పటికీ.. ఇప్పుడు ఆ చర్చకు బలం చేకూరే ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... నూజివీడులోని గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారధితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు పార్ధ సారథి. దీంతో... జోగి త్వరలో జగన్ కి షాకివ్వబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.
వాస్తవానికి గత కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్ పాలిటిక్స్ కి జోగి దూరంగా ఉంటున్నారనే చర్చ బలంగా నడిచింది. ఈ సమయంలో నూజివీడు నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారధితో కలిసి జోగి రమేష్ ప్రత్యక్షమయ్యారు.
అనంతరం.. పార్థసారధితో కలిసి నూజివీడు పురపాలక పరిధిలో కలిసి ర్యాలీగా తిరిగారు. ఇదే సమయంలో... ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ, ఇతర నేతలతో జోగి రమేష్ రాసుకు, పూసుకు తిరిగారనే కామెంట్లు వినిపించాయి. దీంతో... ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... జోగి రమేష్ త్వరలో వైసీపీకి బై బై చెప్పడం.. అనంతరం.. పసుపు కండువా కప్పుకొవడం జరిగిపోవడం ఖాయమనే చర్చ స్థానికంగా బలంగా నడుస్తోందని అంటున్నారు. మరి.. దీనిపై జోగి ఏమైనా స్పందిస్తారా.. లేక, ప్రచారానికి బలం చేకూరుస్తూ మౌనంగానే ఉంటారా అనేది వేచి చూడాలి!