Begin typing your search above and press return to search.

నెతన్యాహు అలా చేస్తారు అనుకోలేదు.. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్

ఇంతకీ ఆయన ఎదుర్కొన్న ఆ ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటో తెలుసుకుందాం..

By:  Tupaki Desk   |   4 Oct 2024 2:55 PM GMT
నెతన్యాహు అలా చేస్తారు అనుకోలేదు.. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్
X

పశ్చిమ ఆసియాలో ఉద్రుక్తి నెలకొన్న వేళ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురించి బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది కూడా ఒక దేశ ప్రధాని ఇలా ప్రవర్తించారు అనే విధంగా ఆయన చెప్పిన ఈ మాటలు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎదుర్కొన్న ఆ ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటో తెలుసుకుందాం..

నెతన్యాహు ఒకసారి తన వ్యక్తిగత బాత్రూంలో ఉపయోగించారు అని పేర్కొన్న బోరిస్ .. ఆయన వెళ్లిన తరువాత ఆ రూమ్ నుంచి కొన్ని మాటలు వినే పరికరాలు ఉన్నట్లు గుర్తించారట. బ్రిటన్ విదేశాంగ మంత్రిగా బోరిస్ ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న ఆయన బయోగ్రఫీలో ఆనాటి విషయం గురించి బోరిస్ పేర్కొనడం గమనార్హం.

'అనీష్డ్' అనే పేరుతో బోరిస్ రాసిన పుస్తకం ఈనెల విడుదల కాబోతోంది. ఇందులో ఆయన తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి రాశారు. అయితే అన్నిటికంటే కూడా 2017లో నెతన్యాహుతో ఆయనకు జరిగిన మీటింగ్ గురించి రాసిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తుందో. ఆయన రాసిన ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ .’అప్పుడు అనుకోకుండా ఆయన నా బాత్ రూమ్ లో ఉపయోగించుకున్నారు.. అది అనుకోకుండా జరిగిందా.. లేక కావాలని జరిగిందా నాకు కూడా తెలియదు.. కానీ ఆయన వెళ్లిన తర్వాత రెగ్యులర్ చెక్ లో భాగంగా సిబ్బంది కొన్ని ఆడియో డివైస్లను ఆ బాత్రూం లో గుర్తించారు. అనంతరం ఇదే విషయాన్ని నాకు వెల్లడించారు. ఈ విషయం గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు నేను రాసిన పుస్తకంలో ఉన్నాయి’అని అన్నారు.

వైట్ హౌస్ లో కూడా ఇటువంటి పరికరాలు అమర్చినట్టు ఇజ్రాయిల్ పై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మరో పక్క ఇజ్రాయిల్ అక్టోబర్ 7న తమ దేశంపై జరిగిన హమాస్ దాడులకు బదులుగా ప్రత్యర్థులను మట్టు పెడుతోంది. ప్రపంచం నిద్రపోయేలా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పేజర్లు, వాకీటాకీలను పేల్చి బీభత్సం సృష్టిస్తోంది. తమ దేశం వైపు దూసుకు వస్తున్న క్షిపనలను ఐరన్ డోమ్తో అడ్డుకుంటూ.. ప్రత్యర్ధులకు తెలియని భయాన్ని పరిచయం చేస్తుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న ఉద్రుత పరిస్థితులు ఏ స్థాయికి చేరుతాయి అన్న విషయం పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతుంది.