Begin typing your search above and press return to search.

జనసేనకు ఆ రోజు పండగే పండుగ!

జనసేన పుట్టాక పెట్టాక ఎన్నో చేరికలు జరిగాయి. కానీ ఈ నెల 26న బలమైన నేతలుగా పేరు పొందిన వారు వైసీపీలో దశాబ్దాలుగా ఉంటూ వచ్చిన వారు జగన్ కి సన్నిహితులు, దగ్గర బంధువులు ఆ పార్టీకి గుడ్ బై కొట్టేసి జనసేనలో చేరుతున్నారు.

By:  Tupaki Desk   |   21 Sep 2024 4:44 PM GMT
జనసేనకు ఆ రోజు పండగే పండుగ!
X

జనసేన పుట్టాక పెట్టాక ఎన్నో చేరికలు జరిగాయి. కానీ ఈ నెల 26న బలమైన నేతలుగా పేరు పొందిన వారు వైసీపీలో దశాబ్దాలుగా ఉంటూ వచ్చిన వారు జగన్ కి సన్నిహితులు, దగ్గర బంధువులు ఆ పార్టీకి గుడ్ బై కొట్టేసి జనసేనలో చేరుతున్నారు. జనసేనకు ఆ విధంగా ఈ నెల 26 స్పెషల్ డే అని చెప్పాలి.

ఏపీలో టీడీపీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఆ పార్టీకి పోటీగా ఇంతవరకూ వైసీపీ ఉంది. ఇపుడు వైసీపీని దెబ్బ తీసే పనిలో టీడీపీ జనసేన ఉన్నాయి. అలా జనసేనను ఎంచుకుని నాయకులు అంతా ఆ పార్టీలోకి వస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల 26న జనసేన కండువా దినోత్సవంగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు క్రిష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత ఉదయభాను అలాగే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వంటి వారు జనసేన తీర్ధం పుచ్చుకుంటున్నారు.

దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరి చేరికకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగే ఈ చేరికలు జనసనకు కొత్త ఉత్సాహాన్నీ ఇస్తాయని అంటున్నారు. ఈ ముగ్గురు కీలక నేతలు పవన్ తో వేరు వేరుగా మాట్లాడారు అని అంటున్నారు.

వీరు కాకుండా విజయనగరం జిల్లాలోని విజయనగరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ యూత్ విభాగం జోనల్ ఇంచార్జిలుగా ఉన్న అవమాపు విక్రం, అలాగే విజయనగరం, పార్వతీపురం జిల్లాల డీసీ ఎం ఎస్ చైర్ పర్సన్ గా ఉన్న డాక్టర్ అవనాపు భావన కూడా జనసేన తీర్ధం పుచ్చుకుంటారు అని అంటున్నారు.

ఇక వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ యాదల అశోక్ బాబు, నాగులుప్పడుపాడు జెడ్పీటీసీ డాక్టర్ యాదల రత్నభారతి జనసేనలో చేరుతున్నారు. వీరే కాకుండా విజయవాడ, గుంటూరు, తిరుపతి కార్పోరేషన్లకు చెందిన అనేక మంది కార్పోరేటర్లు కూడా జనసేనలో చేరుతున్నారు అని పార్టీ వర్గాలు తెలిపాయి.

వీరితో పాటు మరింతమంది వైసీపీ మాజీలు సీనియర్లు కూడా ఒకటి రెండు రోజులలో కీలక నిర్ణయం తీసుకుంటే కనుక ఈ నెల 26న భారీ చేరికలకు వేదికగా ఆ రోజు ఉంటుందని అంటున్నారు. మొత్తానికి వైసీపీ టూ జనసేనకు వలసలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. అయితే ఈ వలసలకు ఇది ఆరంభం మాత్రమే అని రానున్న రోజులలో వైసీపీలో ప్రముఖులతో పాటు ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు అంతా చేరుతారు అని అంటున్నారు మొత్తానికి జనసేన గేట్లు తెరచేసింది. దాంతో వైసీపీకి కొత్త కష్టాలు మొదలైనట్లే అని అంటున్నారు.