Begin typing your search above and press return to search.

మంచు వివాదంలో మోహన్ బాబుకు మరో బిగ్ షాక్!

ఈ నేపథ్యంలో... కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులు కూడా అక్కడకి వెళ్లారు.. ఈ సమయంలో మనోజ్ ను లోపలికి రానియ్యకుండా గేటు మూసేశారు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 4:13 AM GMT
మంచు వివాదంలో మోహన్  బాబుకు మరో బిగ్  షాక్!
X

మంచు ఫ్యామిలీ వివాదం రట్టైన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా మంగాళవారం రాత్రి జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో... కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులు కూడా అక్కడకి వెళ్లారు.. ఈ సమయంలో మనోజ్ ను లోపలికి రానియ్యకుండా గేటు మూసేశారు.

ఆయన బలవంతంగా గేట్లు తోసుకుని మరీ లోపలికి వెళ్లగా.. ఈ నేపథ్యంలో మీడియా కూడా లోపలికి వెళ్లింది. అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ.. మనోజ్ మాత్రం చిరిగిన చొక్కాతో వెనక్కి వచ్చారు. ఆ సమయంలోనే కోపోద్రిక్తుడైన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో అయ్యప్ప దీక్షలో ఉన్న టీవీ9 రిపోర్టర్ దవడ భాగంగా తీవ్ర గాయమైంది.

ఆ తర్వాత మోహన్ బాబు బీపీ ఎక్కువయ్యి ఆస్పత్రిలో చేరడం.. ఆ తర్వత బుధవారం ఉదయం.. మోహన్ బాబుకు ఇంటర్నల్ గాయాలున్నాయని, బీపీ పేరిగిందని చెబుతూ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మరోపక్క టీవీ9 జర్నలిస్టును ఆస్పత్రిలో చేర్చారు. ఈ దాడిపై మోహన్ బాబు వ్యవహార శైలిని చాలా మంది తప్పుబట్టారు.

మరోపక్క మోహన్ బాబు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ జర్నలిస్టులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఇందులో భాగంగా.. బీ.ఎన్.ఎస్. 118 కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. ఈ సమయంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లీగల్ ఒపినీయన్ తర్వాత మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టారు.

అవును... జర్నలిస్టులపై దాడి వ్యవహారంలో మోహన్ బాబుపై బీ.ఎన్.ఎస్. సెక్షన్ 118 కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. లీగల్ ఒపీనియన్ అనంతరం నేడు మోహన్ బాబుపై బీ.ఎన్.ఎస్. సెక్షన్ 109 ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు పహడి షరీఫ్ పోలీసులు!