Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ కి అరుదైన రికార్డ్.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు..

వేగంగా అభివృద్ధి చెందుతున్న జీవనశైలితో పాటు మారుతున్న పరిస్థితుల విద్య హైదరాబాద్ ఇప్పుడు నిద్రపోని మహానగరం గా తయారవుతుంది.

By:  Tupaki Desk   |   4 Oct 2024 5:30 PM GMT
జూబ్లీహిల్స్ కి అరుదైన రికార్డ్.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు..
X

వేగంగా అభివృద్ధి చెందుతున్న జీవనశైలితో పాటు మారుతున్న పరిస్థితుల విద్య హైదరాబాద్ ఇప్పుడు నిద్రపోని మహానగరం గా తయారవుతుంది. నగరంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు పలు ప్రాంతాల నుంచి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాంస్కృతి విషయంలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సామాజిక జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి.

సాధారణంగా నగరాలలో ట్రాఫిక్ కారణంగా పగటిపూట శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ఒకప్పటి మాట.. ఎందుకంటే..ప్రస్తుతం చాలా నగరాలలో పగటిపూట కంటే కూడా రాత్రిపూట శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా హైదరాబాదులో జూబ్లీహిల్స్ తో పాటు అబిడ్స్, తార్నాక్,జేఎన్టీయూ వంటి ప్రాంతాలలో పగటిపూటను మించి రాత్రిపూట శ్రద్ధ స్థాయి పెరిగిపోతోంది.

గతంలో ఆఫీస్ పని వేళలు అంటే పొద్దున పూట ఉండేవి…అయితే గ్లోబలైజేషన్ కారణంగా ఇప్పుడు రాత్రులు పనిచేస్తున్న ఆఫీసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. రాత్రిపూట పని చేసే వారి వృత్తిపరమైన జీవన విధానం కారణంగా శబ్దమవుతాదు పెరిగిందని చెప్పవచ్చు. హైదరాబాదులో అత్యధికంగా 72.53 డేసిబల్స్ శబ్ద తీవ్రత జూబ్లీహిల్స్‌ సమీపంలో రికార్డ్ అయినట్లుగా టీఎస్‌పీసీబీ వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన కొన్ని వివరాలు ప్రస్తుతం హైదరాబాద్ వాసులను కలవరపెడుతున్నాయి. ఈ రిపోర్టు ప్రకారం కొన్ని ప్రాంతాలలో పగటిపూట కంటే కూడా రాత్రివేళల అధిక శబ్ద స్థాయిలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో అనేక రెస్టారెంట్లతోపాటు ఫ్యాషన్ స్టోర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. రాత్రి పది నుంచి ఉదయం 6 గంటల మధ్య ఇక్కడ 45 డిసిబుల్స్‌ శబ్ద ప్రమాణాన్ని గుర్తించారు.

అయితే గత శుక్రవారం మాత్రం ఈ సభ్యస్తీ వ్రత 72.53 డిసిబుల్స్‌గా నమోదైనట్లు అదేరోజు పగటిపూట అక్కడ 69.51 డిసిబుల్స్‌ నమోదవడం గమనార్హం. ఈ విషయం వైరల్ కావడంతో దీనిపై చాలామంది స్పందిస్తున్నారు.ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఈ శబ్ద తీవ్రత అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నెటిజన్లు భావిస్తున్నారు. మిడ్ నైట్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడుతున్న నీటి యువత వ్యవహార శైలి పెరుగుతున్న ఈ శబ్ద కాలుష్యానికి కారణం అని కొందరు భావిస్తున్నారు.