కమల హారిస్... 30 రోజులు ప్రెసిడెంట్!
డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఓటమి పాలవ్వడం తెలిసిందే.
By: Tupaki Desk | 11 Nov 2024 6:20 AM GMTఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడం.. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఓటమి పాలవ్వడం తెలిసిందే. దీంతో.. అమెరికా ఓటర్లు మరోసారి 'మహిళ'ను ఓడించారనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రెసిడెంట్ ఛైర్ లో మహిళ కూర్చోవడాన్ని అమెరికా ఓటర్లు అంగీకరించడం లేదా అనే కామెంట్లూ వినిపించాయి. ఈ సమయంలో ఆసక్తికర ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
అవును... గతంలో హిల్లరీ క్లింటన్, ఇప్పుడు కమలా హారిస్ లు అమెరికా అధ్యక్షలుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు మహిళలూ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పైగా ఈ ఇద్దరూ డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. దీంతో... యూఎస్ అధ్యక్ష పీఠంపై మహిళ కూర్చునే అవకాశం ఉండదా అనే చర్చ విపరీతంగా మొదలైంది. జమల్ సిమ్సన్ ఓ ఆసక్తికర ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
ఇందులో భాగంగా... 20 జనవరి 2025న డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే వరకూ జో బైడెన్ రాజీనామా చేయాలని.. ఆ స్థానంలో తన డిప్యూటీ కమలా హారిస్ ను యునైటెడ్ స్టేట్స్ కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా చేయాలని సూచించారు ఆమె కమ్యునికెషన్స్ మాజీ డైరెక్టర్ జుమాల్ సిమ్సన్. ఇదే సమయంలో... బో బైడెన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సీ.ఎన్.ఎన్.లోని ఓ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు!
ఇందులో భాగంగా.. జో బైడెన్ ఒక అద్భుతమైన అధ్యక్షుడిగా ఉన్నారని.. ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను ఆయన నెరవేర్చారని.. అయితే ఆయన నెరవేర్చగల మరో హామీ మిగిలి ఉందని అన్నారు. ఇందులో భాగంగా.. ఆమెను 30 రోజులైనా అమెరికా ప్రెసిడెంట్ గా నియమించాలని.. ఫలితంగా మరో మహిళ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం సులభమవుతుందని అన్నారు.
దీంతో... ఇది చాలా మంచి ప్రతిపాదన అంటూ కమలా హారిస్ అభిమానులు స్పందిస్తున్నారని అంటున్నారు. ఈ ఆలోచనను బైడెన్ ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నారు. మరి బైడెన్ ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!