తెలంగాణలో కొత్త బీర్ల వ్యవహారం... మంత్రి క్లారిటీ సుస్పష్టం!?
తెలంగాణలో ప్రస్తుతం కొత్త బీర్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 30 May 2024 11:11 AM GMTతెలంగాణలో ప్రస్తుతం కొత్త బీర్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ వ్యవహారంపై తొలుత మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించిన విధానం.. అనంతరం జరిగిన పరిణామాలు వెరసి వ్యవహారం రచ్చ రచ్చగా మారుతుంది. అయితే ఈ వ్యవహారంలో మంత్రి మాటలు రాంగ్ గా కన్వే అయ్యాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... తెలంగాణలో కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని, ఈ విషయం తెలియకుండా ఎవరైనా నిరాధార ఆరోపణలు చేసినా, తప్పుడు వార్తలు రాసినా రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామన్నట్లుగా ప్రకటించారు. అయితే అనూహ్యంగా మంత్రి ప్రకటన చేసే నాటికే తెలంగాణలో కొత్త బీరు కంపెనీలకు అనుమతులు వచ్చేశాయనే కామెంట్లు తెరపైకి వచ్చాయి. మరికొన్ని కొత్త బీర్లు ఇప్పటికే షాపుల్లో దర్శనమిస్తున్నారని అంటునారు.
ఈ నేపథ్యంలో... తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు... రాష్ట్రంలోకి కొత్త మద్యం బ్రాండ్లు వచ్చాయని.. రాష్ట్రంలో బీర్ల కొరత ఎక్కువగా ఉన్నందుకే వాటిని అనుమతించామని.. అయితే దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. బేవరేజెస్ కార్పోరేషన్ దానికి అనుమతించిందని ప్రకటించారు.
దీంతో బీఆరెస్స్ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా... రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటయిన మద్యం అమ్మకాలకు సంబంధించిన కీలక విషయాలు తనకు తెలియదని మంత్రి ప్రకటించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలన్ని నిలదీస్తున్నారు. ఫలితంగా... తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను సైలెంట్ గా మార్కెట్లోకి దించేసిందంటూ నెట్టింట కామెంట్లు అగుపిస్తున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఈ వ్యవహారంపై మంత్రి క్లారిటీ బాగానే ఇచ్చారనే చర్చ తెరపైకి రావడం. ఇందులో భాగంగా... బీఆరెస్స్ ప్రభుత్వ హయాంలోనే నాలుగేళ్ల క్రితమే ఈ కొత్త మద్యం తయారీ కంపెనీలకు అనుమతులు ఇచ్చారని మంత్రి జూపల్లి చెబుతున్నారు. అంటే... అనుమతులు అప్పుడే ఇచ్చినా, ఇప్పుడు వాటి తయారీ కార్యక్రమాలు మొదలయ్యాయని భావించొచ్చని చెబుతున్నారు!
ఇదే సమయంలో ప్రొసీజర్ ప్రకారమే బేవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయాలు తీసుకుంటుందని.. కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలు తన దృష్టికి రావని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు.