Begin typing your search above and press return to search.

చంద్రబాబు సాయం కోరిన ముంబై నటి... సీఎం ఘాటు వ్యాఖ్యలు!!

ప్రధానంగా ఈ వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందనే ప్రచారం కూడా జరగడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 7:52 AM GMT
చంద్రబాబు సాయం కోరిన ముంబై నటి... సీఎం ఘాటు వ్యాఖ్యలు!!
X

కృష్ణాజిల్లాకు చెందిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్.. ముంబైకి చెందిన ఓ నటిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని.. తన పలుబడితో ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశారని.. ఈ విషయంలో పలువురు పోలీస్ అధికారులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల సహకారం ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రధానంగా ఈ వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందనే ప్రచారం కూడా జరగడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే అదంతా తప్పుడు ప్రచారం అంటూ సజ్జల కొట్టిపారేశారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ వ్యవహారంపై తాజాగా ఓ టీవీ ఛానల్ లో స్పందించిన నటి చంద్రబాబు సాయాన్ని కోరారు!

అవును... వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్.. నటి, మోడల్ కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న కాదంబరి జెత్వానీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి మీడియాలో వరుస కథనాలు, ప్రత్యేక డిబేట్లు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన ఆమె... తననూ, తన కుటుంబ సభ్యులను ముంబై నుంచి కృష్ణాజిల్లాకు తీసుకొచ్చి ఓ గెస్ట్ హౌస్ లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. తనకు ప్రాణహాని ఉందని, పోలీసుల రక్షణ కావాలని, తనపై పెట్టిన తప్పుడు కేసుల నుంచి న్యాయపరమైన రక్షణ కావాలంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది.

ఆంధ్రాలోనే కాకుండా, తనపై ఇతర రాష్ట్రాల్లోనూ అనేక కేసులు పెట్టారని ఆమె వెల్లడించింది! ఈ వ్యవహారంలో చాలా పెద్ద తలకాయల పాత్రే ఉందని ఆమె తెలిపీంది. తాను ఓ ఒంటరి యువతినని.. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోగలనని ఆమె తన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ తో తనకు ఎలా పరిచయం అయ్యింది.. మొదలైన విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... 2014లో తాను తెలుగు సినిమా రంగంలోని పనిచేసిన సమయంలో విద్యాసాగర్ తో తనకు పరిచయం ఏర్పడిందని.. ఆ సమయంలో అతడు ఖరీదైన గిఫ్టులతో తనను ప్రలోభాలకు గురిచేశాడని ఆమె ఆరోపించింది. ఓ కేసులో అతను మూడేళ్లుగా తప్పించుకుని తిరిగాడని.. అతడిని 2017లోనే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చింది.

ఇదే క్రమంలో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత నాకు సాయం చేయాలంటూ కాదంబరి జెత్వానీ కోరారు. ఈ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. "అది వైకాపా పార్టీ కాదు.. వైకామ పార్టీ.. ఛీ.. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయాల్సి రావడం నాకే సిగ్గు వేస్తోంది.. అసహ్యం వేస్తోంది.. అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

ఇదే సమయంలో... ఈ స్టోరీలన్నీ వింటుంటే ఆ పార్టీ నేతల బిహేవియర్ గురించి తెలుసుకుంటుంటే అసహ్యం వేస్తోందని చెప్పిన చంద్రబాబు... గతంలో రాజకీయాల్లో చిన్న ఘటన జరిగితే అది ఓ పెద్ద స్కాండల్ అని అనుకునేవారమని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు వైసీపీలో అలాంటివన్నీ కామన్ అయిపోయాయని బాబు విమర్శించారు.

పార్టీ అధినేత వాటి గురించి మాట్లాడటం లేదని అన్నారు. ఇదే సమయంలో... రాజకీయ పార్టీలను ఇలా నడుపుతారా.. ఇలాంటి నాయకులు ప్రజలకు ఆదర్శమా అని ప్రశ్నించిన చంద్రబాబు... గత ప్రభుత్వ హాయాంలో భయంకరమైన నెట్ వర్క్ తో రాష్ట్రాన్ని గంజాయి మత్తులోకి నెట్టివేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సొంత లిక్కర్ బ్రాండ్లను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు.