Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కు కావ్య ఎందుకు షాకిచ్చింది? కారణాలేంటి?

బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒకటి తరువాత మరొకటి షాక్ లు ఇస్తూనే ఉన్నారు

By:  Tupaki Desk   |   29 March 2024 4:15 AM GMT
బీఆర్ఎస్ కు కావ్య ఎందుకు షాకిచ్చింది? కారణాలేంటి?
X

బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒకటి తరువాత మరొకటి షాక్ లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి మరో సంచలనం రేపింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించింది. వరంగల్ ఎంపీ బరి నుంచి తాను పోటీలో ఉండటం లేదని చెప్పి ఆశ్చర్యం నింపింది.

బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు షాక్ లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ షాక్ తో తేరుకోలేకపోతోంది. అంతా సవ్యంగా జరుగుతుందనుకునే సందర్భంలో కావ్య ఇలాంటి బాంబు పేల్చడం పార్టీ నాయకత్వాన్ని రసకందాయంలో పడేసినట్లు అయింది. దీంతో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. బీఆర్ఎస్ పార్టీ మనుగడపైనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొద్దీ రోజులుగా అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం వంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. పార్టీ పరువును గంగలో కలిపేస్తున్నాయి. దీంతో పార్టీపై సహజంగానే విమర్శల దాడి పెరుగుతోంది. ఈనేపథ్యంలో కావ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. తాను పోటీలో ఉండటం లేదని కుండబద్ధలు కొట్టడంతో బీఆర్ఎస్ నాయకత్వం తల పట్టుకుంటోంది.

మరోవైపు నాయకత్వం మధ్య సమన్వయం లోపించింది. ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. దీంతో నేతల్లో సఖ్యత ఉండటం లేదు. విమర్శల దాడి పెరుగుతోంది. దీని వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. ఇతర పార్టీల నేతల ఆరోపణలు కూడా పార్టీని వేధిస్తున్నాయి. కవిత అరెస్టు తో పార్టీ నష్టాల్లో కూరుకుపోయింది.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దెబ్బ తినడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయి. దీంతో పార్టీకి నాయకత్వ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ను నమ్మే స్థితిలో లేరు. ఏది మాట్లాడినా పార్టీకి ఎదురు దెబ్బలే తగులుతున్నందున బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీస సీట్లు కూడా సాధించే అవకాశాలు తక్కువనే చెబుతున్నారు.