కడియం శ్రీహరి చెప్పిన వలసల కథ
వరంగల్ లో కడియం శ్రీహరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారడంపై విమర్శలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 2 April 2024 8:30 AM GMTవరంగల్ లో కడియం శ్రీహరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారడంపై విమర్శలు వస్తున్నాయి. ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లు అవసరం ఉన్నప్పుడు పార్టీని పట్టుకుని వేలాడిన నేతలు ప్రస్తుతం పార్టీని మార్చి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. కడియం శ్రీహరి తీరు వివాదాస్పదంగా మారింది. పార్టీ మారడంతో శ్రీహరిని చీప్ గా చూస్తున్నారు.
అవకాశాలే నా దరికి వస్తున్నాయి. నేను వాటి దగ్గరకు వెళ్లడం లేదని కడియం స్పష్టం చేస్తున్నారు. తన కూతురు కావ్య భవిష్యత్ కోసం పార్టీ మారాల్సి వచ్చిందని అంటున్నారు. కావ్య కోసం పార్టీ మారాను. అధికార పార్టీలో ఉంటే పనులు అవుతాయి. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉంటే పనులు ముందుకు సాగవు. అందుకే పార్టీ మార్పు అనివార్యమైంది. ఓడిపోయే పార్టీలో ఉంటే లాభం ఉండదని తన మనసులోని మాట వెల్లడించారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు మనవరాలి వయసున్న మహిళ చేతిలో ఓడిపోవడం సిగ్గు చేటు. పల్ల రాజేశ్వర్ రెడ్డి పార్టీకి చీడ పురుగులా మారారు. అవకాశవాదులకు అవకాశమిచ్చిన కేసీఆర్ తరువాత తగిన ఫలితాలు అనుభవిస్తున్నారు. నన్ను రాజీనామా చేయాలని చెప్పే అర్హత ఎవరికి లేదు. నేను నా సొంత ఇమేజ్ తో గెలిచాను. కానీ పార్టీ నాకు ఎలాంటి లాభం చేకూర్చలేదని చెబుతున్నారు.
కేంద్రప్రభుత్వం మెడలు వంచాలంటే రాష్రంలో అధికారంలో ఉన్నపార్టీతోనే సాధ్యమవుతుంది. అలాంటి పార్టీ కాంగ్రెస్. బీఆర్ఎస్ కు అంత సీన్ లేదు. అందుకే పార్టీని వీడా. నియోజకవర్గ డెవలప్ మెంట్ కోసం పార్టీ మారా కానీ వేరే ఉద్దేశంతో కాదు. కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గ సమస్యలు తీరుస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరి వరంగల్ లోక్ సభ స్థానాన్ని తన కూతురుకు దక్కించుకున్నారు. బీఆర్ఎస్ లో ఇంకా చాలా మంది పార్టీని వీడే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతోనే నేతలు వలస వెళ్తున్నారు. దీని వల్ల బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని చాలా నేతలు చెబుతున్నారు.