Begin typing your search above and press return to search.

బెంగళూరు రేవ్ పార్టీ.. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ!

అవును... బెంగళూరు రేవ్ పార్టీ కేసు ప్రస్తుతం ప్రముఖ సినీ నటి చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 May 2024 1:59 PM GMT
బెంగళూరు రేవ్  పార్టీ.. ఏపీలో వైసీపీ వర్సెస్  టీడీపీ!
X

చాలా రోజుల తర్వాత మరోసారి సినీ ప్రముఖులు ప్రధానంగా పాల్గొన్నట్లు చెబుతున్న రేవ్ పార్టీ వ్యవహారం బెంగళూరు కేంద్రంగా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు తెరపైకి రావడం, వాటిని వారు ఖండించడం, తర్వాత నిజమే అని తెలియడం వంటి ఎన్నో ట్విస్టులు, జలక్కులతో ఈ వ్యవహారం నడుస్తుంది! ఈ సమయంలో ఏపీ మంత్రి ఈ విషయంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

అవును... బెంగళూరు రేవ్ పార్టీ కేసు ప్రస్తుతం ప్రముఖ సినీ నటి చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈ వ్యవహారంలో రాజకీయ కోణం కూడా ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా.. అదే పార్టీలో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ స్టిక్కర్ తో ఉన్న ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా తనపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాకాని స్పందించారు. ఇందులో భాగంగా.. తాజాగా నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన పూర్తి ఆధారలతో మీడియా ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన కారు తనది కాదని చెప్పిన కాకాని.. తన ఆర్సీ కాపీని మీడియాకు చూపించారు. ఆ కారును తాను కొన్నట్లు, అమ్మినట్లు ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో బెంగళూరు రేవ్ పార్టీ వద్ద పోలీసులకు పట్టుబడినట్లు చెబుతున్న కారుపై ఉన్న స్టిక్కర్ కూడా తన అధికారిక స్టిక్కర్ కాదని చెప్పిన మంత్రి.. తన స్టిక్కర్ ను ఎవరో ఫోర్జరీ చేసి ఉంటారని అనుమానించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు చెబుతూ ఆ ఎఫ్.ఐ.ఆర్. కాపీని కూడా ప్రదర్శించారు.

అనంతరం తనపై ఆరోపణలు చేసిన సోమిరెడ్డిని తగులుకున్న కాకాని... ఈ సందర్భంగా ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దామని, ఎవరి రక్తంలో ఆల్కహాల్, డ్రగ్స్ ఉన్నాయో తెలుస్తుందని అన్నారు. ఈ క్రమంలో సోమిరెడ్డిని పేకాటరాయుడిగా, తాగుబోతుగా అభివర్ణించారు కాకాని.

ఇక అతడి రాసలీలలపై పుంఖానుపంఖాలుగా కథనాలు వచ్చాయంటూ కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ కూడా చూపించిన కాకాని... బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని.. అయితే రాజకీయ లబ్ది పొందేందుకు వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదని తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.