మారుతున్న స్థానికం... జనసేన సంచలనం!
ఇందులో భాగంగా... తాజాగా కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) పదవిని జనసేన కైవసం చేసుకుంది.
By: Tupaki Desk | 27 March 2025 11:07 AMఏపీలో రాజకీయం మారుతోంది.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ రాజకీయ మారగా.. అనంతరం జరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో స్థానిక రాజకీయం కూడా మారుతోంది. ఇందులో భాగంగా... తాజాగా కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) పదవిని జనసేన కైవసం చేసుకుంది. ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. ఇందులో భాగంగా... వైసీపీకి మాంచి పట్టున్నట్లు చెప్పే కాకినాడ రూరల్ ఎంపీపీ పదవిని ఊహించని పరిణామాల మధ్య జనసేన కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా.. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ముగియడం గమనార్హం.
వివరాళ్లోకి వెళ్తే... 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలన్నీ అప్పటి అధికార పార్టీ వైసీపీ ఖాతాలో పడిన సంగతి తెలిసిందే. అయితే.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంలో అనూహ్యంగా లెక్కలు మారిపోతున్నాయి. ఇందులో భాగంగా... తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఇందులో భాగంగా... కాకినాడ రూరల్ మండల పరిధిలో ఏడుగురు వైసీపీ ఎంపీటీసీలు జనసేన గూటికి చేరారు. అయినప్పటికీ 8 మంది ఎంపీటీసీలు ఇంకా వైసీపీకి ఉన్నారు. ఈ సమయంలో గురువారం కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక జరగ్గా.. జనసేనలో చేరిన ఏడుగురు ఎంపీటీసీపీ ఎంపీపీ కార్యాలయానికి చేరుకున్నారు.
అయితే... మిగిలిన వైసీపీ ఎంపీటీసీలు ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో.. టీడీపీ ఎంపీటీసీల మద్దతుతో జనసేన అభ్యర్థి అనంత లక్ష్మి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
దీంతో... కాకినాడ రూరల్ వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నాబాబు.. కాకినాడ సిటీ వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ పై చర్చ మొదలైంది. ఇద్దరు బలమైన వైసీపీ నేతలు ఉన్నప్పటికీ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తనదైన వ్యూహంతో ఈ పని పూర్తి చేశారనే చర్చ మొదలైంది.