Begin typing your search above and press return to search.

విజయసాయి రెడ్డిపై ఏపీ సీఐడీ లుక్ ఔట్ సర్క్యులర్... కారణం క్లియర్!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకినాడ పోర్టు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Dec 2024 6:22 AM GMT
విజయసాయి రెడ్డిపై ఏపీ సీఐడీ లుక్  ఔట్  సర్క్యులర్...  కారణం క్లియర్!
X

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకినాడ పోర్టు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కాకినాడ యాంకరేజ్ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారనే చర్చ నుంచి మొదలైన ఈ వ్యవహారం.. కాకినాడ సీ పోర్టులో వాటాలను గతంలో బలవంతంగా లాక్కున్నారనే వరకూ వచ్చింది. ఈ సమయంలో సాయిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి.

అవును.. ఏపీ రాజకీయాలకు ఇప్పుడు కాకినాడ పోర్టు కీలక కేంద్రంగా మారిందనే చర్చ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఈ పోర్టు, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలే ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్స్ గా మారాయి. పవన్ ఆదేశించిన "సీజ్ ది షిప్" అంశం నుంచి జాతీయ స్థాయిలో ఈ పోర్టులో జరుగుతున్నట్లు చెబుతున్న పలు వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి!

ఈ నేపథ్యంలో... కాకినాడ సీ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్ లోని రూ.3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వర రావు (కేవీ రావు) నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సీఐడీ కేసు నమోదు చేసిందని చెబుతున్నారు. ఇందులో పలువురు వైసీపీ నేతలు నిందితులుగా ఉన్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఈ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డి కీలక నిందితులుగా ఉన్నారని అంటున్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ బెదిరించారనేది వీరిపై ఉన్న ప్రధాన అభియోగంగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డిపైనా ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్.వో.సీ) జారీ చేసింది. వీరు ముగ్గురూ విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేశారు! దీంతో... ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.