జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్ధిగా టీ టైం ఉదయ్ శ్రీనివాస్...!
ఈ రెండు సీట్లు కూడా చాలా ముఖ్యమని ఆయన చెప్పారు.
By: Tupaki Desk | 19 March 2024 5:59 PM GMTబిగ్ షాట్ గా బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న టీ టైం యజమాని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇపుడు కాకినాడ నుంచి జనసేన తరఫున ఎంపీ అభ్యర్ధిగా ఎంపిక అయ్యారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. తాను పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేయబోతున్నామని అన్నారు. ఈ రెండు సీట్లు కూడా చాలా ముఖ్యమని ఆయన చెప్పారు.
జనసేన ఈ రెండు సీట్లలో పోటీ చేయడం అంటే గెలుపు దిశగా అడుగులు పడుతున్నట్లే లెక్క అన్నారు. ఇదిలా ఉంటే టీ టైం అంటూ ఏపీలో సంస్థని స్థాపించి దేశవ్యాప్తంగా దాదాపుగా మూడు వేల దాకా అవుట్ లెట్ లలో విస్తరించిన ఉదయ్ శ్రీనివాస్ రాజకీయాల్లోకి రావాలని భావించి జనసేనలో చేరారు.
ఆయనను పిఠాపురం ఇంచార్జిగా నియమించారు. ఇపుడు ఆయనను ఏకంగా ఎంపీ అభ్యర్ధిగా పవన్ చేశారు. ఉదయ్ శ్రీనివాస్ 2006లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆయన దుబాయ్ లో జాబ్ చేశారు. ఇక ఆయన టీ టైం బిజినెస్ ప్రస్తావనకు వస్తే 2016లో రాజమండ్రీలో మొదటి అవుట్ లెట్ ని ఆయన ప్రారంభించారు. అది అంతకంతకు విస్తరించి ఈ రోజుకు దేశం అంతటా టీ టైం ఉంది అని పంచుకుంది.
ఇక దీని ద్వారా ఏడాదికి మూడు వందల కోట్ల టర్నోవర్ వస్తుందని అంటున్నారు. బిజినెస్ ఫీల్డ్ లో పేరు గడించిన ఉదయ్ భాస్కర్ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. ఆయన జనసేన తరఫున పోటీ చేస్తారు అని చాలా కాలంగా వినిపించింది. ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు అనుకున్నారు.
పిఠాపురం ఇంచార్జిగా చేశారు. అయితే అనూహ్యంగా ఆయనను ఇపుడు ఎంపీగా పోటీ చేయడానికి వెళ్లమని పవన్ కోరారు. దాంతో ఉదయ్ ఎంపీ అభ్యర్ధి అయిపోయారు. ఆయన కంటే ముందు జనసేన తరఫున కాకినాడ ఎంపీ అభ్యర్ధిగా సానా సతీష్ బాబు పేరు వినిపించింది. మరి ఇపుడు మాత్రం టీ టైం ఉదయ్ కి చాన్స్ ఇచ్చారు. పవన్ కి అత్యంత సన్నిహితులలో ఒకరిగా ఉదయ్ పేరు పొందారు. సో ఆయనకు అలా చాన్స్ దక్కింది అని అంటున్నారు.