కాళేశ్వరం గుదిబండ.. సార్ గాలి తీసేసిన కాగ్!
అయితే.. అలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కాగ్ తేల్చేసింది.
By: Tupaki Desk | 14 Jan 2024 2:30 PM GMTతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మాట్లాడేవారు. దానిని గొప్పగా ప్రొజెక్టు చేసుకునేవారు కూడా. ఎన్నికల సమయంలోనూ.. ఈ ప్రాజెక్టు గురించే చెప్పుకొచ్చారు. తెలంగాణ రాకుంటే కాళేశ్వరం వచ్చేదా? అని ప్రశ్నించేవారు. అయితే.. అలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కాగ్ తేల్చేసింది.
అంతేకాదు.. కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద గుది బండగా కాగ్ చెప్పడం ఇప్పుడు సంచల నంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు త్రైమాసికాలకు సంబంధించిన లెక్కలు.. ప్రభుత్వ విధానాలపై అధ్యయనం చేసిన కాగ్.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా నివేదికను సమర్పించింది. దీనిలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి దాదాపు 32 పేజీల సుదీర్ఘ వివరణ ఇచ్చింది.
ఇవీ.. కాగ్ ఎత్తి చూపిన అంశాలు..
+ రూపాయి ఖర్చు పెడితే.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయం కేవలం 52 పైసులు. మరో 8 పైసులు ప్రభుత్వానికి నష్టం
+ గత ప్రభుత్వం ఎంతో ఊహించుకుని.. ఈ ప్రాజెక్టును నిర్మాణం చేసింది. కానీ,అవి ఊహలు మాత్రమే. వాస్తవాలు కాదు.
+ ప్రాజెక్టు నిర్వహణకు ప్రతి సంవత్సరం రూ.14,351 కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం పేర్కొందని.. కానీ, వాస్తవానికి అయ్యే ఖర్చు 28,270 కోట్లు మాత్రమేనని కాగ్ పేర్కొంది.
+ ఈ ప్రాజెక్టు నిర్వహణకు అయ్యే విద్యుత్ ఖర్చు రూ.10,374 కోట్లని కాగ్ పేర్కొంది. కానీ, గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విద్యుత్ వ్యయాన్ని బాగా తగ్గించి చూపించి.. రూ.4,148 కోట్లుగా పేర్కొందని తెలిపింది. ఇది.. అనూహ్యమని వ్యాఖ్యానించింది.
+ కాళేశ్వరం నుంచి భారీ ఎత్తున ఏడాదికి ఆదాయం(21,682 కోట్లు) వస్తుందని చెప్పినా.. అది కూడా తక్కువేనని కాగ్ పేర్కొంది. ఆదాయం కేవంలం 14, 709 కోట్లు మాత్రమే వస్తుందని తెలిపింది.
+ కాళేశ్వరం నిర్మాణానికి రూ.87,449 కోట్ల అప్పులు చేశారని, దీనికి రూ.54,174 కోట్లు వడ్డీ కట్టాల్సి వుంటుందని కాగ్ వివరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగా మారుతుందని కాగ్ పేర్కొంది.
+ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు లక్ష ఎకరాల ఆయకట్టు రాలేదని.. కేవలం 40, 288 ఎకరాలే ఈ ప్రాజెక్టు కింద అందుబాటులోకి వచ్చిందని కాగ్ పేర్కొంది.